Home
Deal of the day

అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్‌లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు...

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన యొక్క ప్లాట్‌ఫారమ్‌ ద్వారా కొనుగోలు చేయడం కోసం కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక చర్యలను తీసుకుంటున్నది. ఆన్‌లైన్‌లో ఏవైనా కొత్త వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులకు మొదటి ఎంపిక అమెజాన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అమెజాన్ ఎల్లప్పుడూ ప్రత్యేక ఆఫర్లను అందిస్తూ ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తోంది. ప్రతి రోజు 'డీల్ అఫ్ ది డే' అమ్మకాలలో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు మరియు ల్యాప్‌టాప్‌ల కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్లను అందిస్తుంది. కొన్నిసార్లు విక్రయాలు లేనప్పటికీ అమెజాన్ ప్లాట్‌ఫారమ్ లో ఎంచుకున్న ఫోన్‌లు మరియు ల్యాప్‌టాప్‌లతో సహా ఇతర స్మార్ట్ పరికరాలను అందిస్తుంది. అమెజాన్ ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన కంపెనీల ల్యాప్‌టాప్ పరికరాలపై గొప్ప తగ్గింపును అందిస్తోంది. అదనంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌ల నుండి తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అమెజాన్‌లో కొన్ని అత్యుత్తమ తగ్గింపు మరియు ప్రసిద్ధ ల్యాప్‌టాప్‌లను చూద్దాం.

Amazon Todays Deals Offers: Top 6 Best Laptop Under Rs.30,000 in India

ఆసుస్ ల్యాప్‌టాప్ (E210MA-GJ002T) ధర రూ.24,495

ఆసుస్ కంపెనీ నుండి వచ్చిన ఈ ల్యాప్‌టాప్ ఇప్పుడు అమెజాన్ లో రూ.24,495 ధర వద్ద లభిస్తుంది. ఇది 11.6 అంగుళాల స్క్రీన్‌ని కలిగి ఉంది. దీని డిస్‌ప్లే HD LED ఫార్మాట్‌లో ఉండి మంచి బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ ప్రాసెసర్ ద్వారా రన్ అవుతూ విండోస్10 OS మద్దతును కలిగి ఉంది. ఇది 4GB RAM మరియు 128GB eMMC స్టోరేజ్ ఆప్షన్‌తో కూడా వస్తుంది. ల్యాప్‌టాప్ 1 కిలోల 690 గ్రాముల బరువు మరియు 27.91 x 12.12 x 1.69 సెం.మీ. Wi-Fi, USB మరియు HDMI ఎంపికలు కూడా ఉన్నాయి.

లెనోవా ఐడియాఐపాడ్ 3 క్రోమ్ బుక్ ల్యాప్‌టాప్ ధర రూ.20,338

లెనోవా ఐడియాఐపాడ్ 3 క్రోమ్ బుక్ ల్యాప్‌టాప్ అమెజాన్ లో రూ.20,338 ధర వద్ద లభిస్తుంది. ఇది 11.6-అంగుళాల HD డిస్‌ప్లేను HD పిక్సెల్ రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ 2.5 GHz ప్రాసెసర్‌తో ఆధారితమైనది మరియు 4GB RAM మరియు 64GB eMMC స్టోరేజ్ ను కలిగి ఉంది. Chrome OSలో పనిచేసే ఈ ల్యాప్‌టాప్ బరువు 1.2 కిలోల బరువుతో మరియు 28.5 x 20.5 x 1.8 సెం.మీ కొలతల పరిమాణంలో వస్తుంది. ఇది బ్లూటూత్, Wi-Fi మరియు USB కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉంది. యాంటీ గ్లేర్ ఆప్షన్‌లతో 250 నిట్స్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంటుంది.

ఆసుస్ EeeBook 12 ల్యాప్‌టాప్ దర రూ.24,990

ఆసుస్ కంపెనీ ల్యాప్‌టాప్ ఇప్పుడు అమెజాన్ లో రూ.24,990 ధర వద్ద లభిస్తుంది. ఇది 11.6 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని డిస్‌ప్లే 250 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది మరియు 73% స్క్రీన్-టు-బాడీ గ్యాప్ తో వస్తుంది. ఇది INTEL Celeron Dual Core N4020 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. అలాగే ఇది Windows 10 మద్దతును కలిగి ఉండి 64GB EMMC స్టోరేజ్+ 4GB RAM తో జోడించబడి లభిస్తుంది. అదనంగా ఇంటెల్ UHD 600 గ్రాఫిక్‌లను ఇంటిగ్రేట్ చేసింది. Wi-Fi, USB మరియు HDMI ఎంపికలు ఉన్నాయి. పికాక్ బ్లూ కలర్ ఆప్షన్ ఉంది.

Acer Acer Extensa 15 ల్యాప్‌టాప్ ధర రూ.28,260

Acer Extensa 15 ల్యాప్‌టాప్ ఇప్పుడు అమెజాన్ లో రూ.28,260 ధర వద్ద లభిస్తుంది. ఇది 15.6-అంగుళాల డిస్‌ప్లేను తక్కువ స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో కలిగి ఉంది. ఈ పోర్టబుల్ ల్యాప్‌టాప్ యొక్క బరువు 1.9 కిలోలు. ఈ ల్యాప్‌టాప్ AMD 3020e డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 4GB RAM, 1TB HDD, విండోస్10, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సామర్థ్యాలతో కలిగి ఉండి 9 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ను అందిస్తుంది. రెండు అంతర్నిర్మిత స్పీకర్లు మరియు డిజిటల్ మైక్రోఫోన్ ఎంపికను కలిగి ఉంటుంది. ఇది వ్యక్తిగత మరియు వ్యాపారం రెండింటికీ సరైన ల్యాప్‌టాప్.

HP Chromebook ల్యాప్‌టాప్ దర రూ.23,990

HP Chromebook ల్యాప్‌టాప్ ఇప్పుడు అమెజాన్ లో రూ.23,990 ధర వద్ద లభిస్తుంది. ఇది 11.6-అంగుళాల డిస్‌ప్లేప్యాక్‌ను 1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో లభిస్తుంది. ఇది సన్నని ఆకృతిని కలిగి ఉండడమే కాకుండా బరువు తక్కువగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ టచ్ స్క్రీన్ లాంటిది. కీబోర్డ్ ఎంపిక ఉంది. 4GB / 64GB, eMMC, Chrome OS. ఈ ల్యాప్‌టాప్‌లో Google అసిస్టెంట్ అంతర్నిర్మితమై ఉంది. ఈ ల్యాప్‌టాప్ Chrome OSలో రన్ అవుతుంది. ప్రముఖ Gmail, YouTube, Amazon Prime, Slack, Printer, Lightroom, WhatsApp, MS Office వంటి యాప్‌లకు యాక్సెస్ ఉంది. ఇది 12 గంటల బ్యాటరీ బ్యాకప్‌ని పొందిందని చెప్పారు.

లెనోవా ఐడియాఐపాడ్ 3 11 క్రోమ్ బుక్ ధర రూ.24,480

లెనోవా ఐడియాఐపాడ్ 3 11 క్రోమ్ బుక్ ల్యాప్‌టాప్ ఇప్పుడు అమెజాన్ లో రూ.24,480 ధర వద్ద లభిస్తుంది. ఇది 11.6 అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు డిస్‌ప్లే 1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ల్యాప్‌టాప్ ఇప్పుడు Intel Celeron N4020 ప్రాసెసర్‌తో ఆధారితమైనది మరియు 4GB LPDDR4 RAM, 64GB eMMC నిల్వ, ఇంటెల్ UHD గ్రాఫిక్స్ 3000, Chrome 2 గ్రాఫిక్స్ 60000 ఫీచర్లను కలిగి ఉంది. Chrome OSలో పనిచేసే ఈ ల్యాప్‌టాప్ తక్కువ బరువుతో పాటు వెబ్‌క్యామ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఇది బ్లూటూత్, Wi-Fi మరియు USB కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉంది.

English summary
Amazon Today's Deals Offers: Top 6 Best Laptop Under Rs.30,000 in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X