Home
Deal of the day

అమెజాన్ నేటి డీల్స్ లో వివో స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై ఊహించని డిస్కౌంట్లు

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ కోసం అనువైనదిగా ఉంది. ఇండియాలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి చాలా మంది ఆన్‌లైన్ పద్దతిలో కొనుగోలు చేయడానికి అధికంగా ఇష్టపడుతున్నారు. అటువంటి కస్టమర్‌ల కోసం అమెజాన్ ప్రతి రోజు డీల్ అఫ్ ది డే విభాగంలో కొన్ని రకాల వస్తువులపై ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. అందులో భాగంగా వివో బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ల మీద కొన్ని తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నది. వివో బ్రాండ్ యొక్క కొత్త ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం. అమెజాన్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు అన్ని రకాల బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కొనుగోలు మీద వారికి రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే అదనంగా 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Todays Deals: Vivo Brand Smartphones Brings More Discount Offers

వివో X60 ధర రూ.34,990

వివో X60 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఇండియాలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.34,990 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ రూ.39,990 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతుంది. ఇది 6.56-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,376 పిక్సెల్స్) అమోలెడ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ని కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా శక్తిని పొందుతూ 12GB LPDDR4X RAM మరియు 256GB వరకు UFS 3.1 విస్తరించలేని స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, GPS, బ్లూటూత్ v5.1 మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అలాగే ఇది 4,200 ఎంఏహెచ్ బ్యాటరీని 33W ఫ్లాష్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో ప్యాక్ చేయబడి వస్తుంది.

వివో Y73 ధర రూ. 20,990

వివో Y73 స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.20,990 ధర వద్ద డైమండ్ ఫ్లేర్ మరియు రోమన్ బ్లాక్ కలర్ లలో అందించబడుతుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 11.1తో రన్ అవుతుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G95 SoC చేత శక్తిని కలిగి ఉండి 8GB RAM తో పాటు 3GB పొడిగించదగిన RAM ఫీచర్‌లతో వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో లభిస్తుంది. అలాగే ఇది 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేసి 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

వివో Y33s ధర రూ.18,990

వివో Y33s స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.18,990 ధర వద్ద మిడ్ డే డ్రీమ్ మరియు మిర్రర్ బ్లాక్ కలర్ లలో లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారంగా మరియు ఫన్‌టచ్ ఓఎస్ 11.1 తో రన్ అవుతుంది. అలాగే ఇది 6.58-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ ఎల్‌సిడి డిస్‌ప్లేను 1,080x2,408 పిక్సెల్స్ తో కలిగి ఉంటుంది. ఇది హుడ్ కింద ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G80 SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM మరియు 4GB విస్తరించిన ర్యామ్‌తో పాటుగా 128GB స్టోరేజ్‌తో జతచేయబడి వస్తుంది., ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటుగా డిస్‌ప్లే చుట్టూ మందపాటి బెజెల్స్ నిర్మాణం మరియు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ కలిగి ఉండి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇందులో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, 4G, బ్లూటూత్ v5, NFC, GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, ఇ-కంపాస్ మరియు గైరోస్కోప్ వంటివి ఉన్నాయి.

వివో Y53s ధర రూ.19,939

వివో Y53s స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 8GB RAM + 128GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ లో రూ.19,939 ధర వద్ద డీప్ సీ బ్లూ మరియు ఫెంటాస్టిక్ రెయిన్‌బో వంటి కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 పై ఫన్‌టచ్ OS11.1 తో రన్ అవుతూ 6.58-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, స్టాండర్డ్ 60HZ రిఫ్రెష్ రేట్‌తో పాటు 20: 9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ MediaTek Helio G80 SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM తో జతచేయబడి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో f/.79 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరాతో పాటు, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం f/2.0 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. అలాగే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో పాటుగా 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేయబడి అందిస్తుంది.

English summary
Amazon Today's Deals: Vivo Brand Smartphones Brings More Discount Offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X