Amazon షియోమి ఫ్లాగ్ షిప్ డైస్ సేల్లో Mi ఫోన్ల కొనుగోలుపై రూ.2500 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

2022 నూతన సంవత్సరం మొదలైంది. కొత్త సంవత్సరం మొదటి నెలలో ఏదైనా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనీ భావిస్తున్నారా? అయితే ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు తన యొక్క ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం తన యొక్క సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. ఇప్పుడు అమెజాన్ షియోమి ఫ్లాగ్ షిప్ డైస్ పేరుతో కొత్త సేల్ ను నిర్వహిస్తున్నది. ఈ అమ్మకంలో షియోమి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను అందించింది. అమెజాన్ లో జనవరి 10 వరకు జరిగే ఈ విక్రయ సమయంలో సిటీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ.2500 వరకు ఇన్స్టెంట్ తగ్గింపును అందిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Xiaomi Flagship Days Sale 2022 Offers Huge Discounts on Mi Brand Smartphones

షియోమి Mi 11X 5G ధర రూ.22,999

షియోమి Mi 11X 5G ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో రూ.22,999 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వివరాల విషయానికి వస్తే ఫోన్ 6GB/ 8GB ర్యామ్ ఎంపికలతో పాటుగా 6.67-అంగుళాల ఫుల్ HD + అడాప్టివ్‌సింక్ డిస్ప్లేను మధ్యలో పంచ్-హోల్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వినియోగ కేసును బట్టి వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (30Hz నుండి 120Hz) కు మద్దతు ఉంది. అలాగే ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్ ఫీచర్లతో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ తో పాటుగా 5G సపోర్ట్, 120HZ డిస్‌ప్లే ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో వృత్తాకార మాడ్యూల్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 108-మెగాపిక్సెల్ వద్ద మరియు సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్ తో 13-మెగాపిక్సెల్ వద్ద మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, IR బ్లాస్టర్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది

షియోమి Mi 11X ప్రో 5G ధర రూ.31,999

షియోమి Mi 11X ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో రూ.31,999 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వివరాల విషయానికి వస్తే ఇది 6.67-అంగుళాల 3D కర్వడ్ అమోలెడ్ ట్రూ కలర్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని యొక్క ప్యానెల్ HDR10 +, FHD + రిజల్యూషన్, DCI-P3 కలర్ మరియు 1120nits గరిష్ట ప్రకాశానికి మద్దతు ఇస్తుంది. ఇది మైక్రోడాట్-నాచ్డ్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ ప్యానెల్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేటుకు మద్దతు ఇస్తుంది. వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్, OIS, EIS సెన్సార్‌ల మద్దతు కూడా ఉన్నాయి. దీని ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియోల కోసం 20 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ప్రో వీడియో రికార్డింగ్ మోడ్, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, రా మోడ్ వంటి మరెన్నో ఫీచర్లను కూడా కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, వై-ఫై 6, బ్లూటూత్, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జిపిఎస్, హై-రెస్ ఆడియో, NFC మరియు ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్ ఉన్నాయి. ఈ ఫోన్ 4,780mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

షియోమి Mi 10T 5G ధర రూ.31,990

అమెజాన్ లో షియోమి Mi 10T 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ రూ.31,990 ధర వద్ద కాస్మిక్ బ్లాక్ కలర్ లలో లభిస్తుంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా EMI లావాదేవీలను ఉపయోగించి ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ.2000 వరకు తక్షణ తగ్గింపును కూడా పొందుతారు. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5తో రన్ అవుతుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని యొక్క డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఫోన్ Mali-G57 MC2 GPU మరియు 8GB వరకు LPDDR4X RAMతో పాటు ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 810 SoC ద్వారా అందించబడుతుంది. Xiaomi మల్టీ టాస్కింగ్ కోసం 3GB అదనపు RAMని వాస్తవంగా జోడించడానికి ఫోన్‌లో అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగించే RAM బూస్టర్ ఫీచర్‌ను కూడా ప్రీలోడ్ చేసింది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌తో పాటు f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరాను కలిగి ఉంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.45 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

Xiaomi 11 Lite NE 5G రూ.22,499

Xiaomi 11 Lite NE 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.22,499 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఇది MIUI 12.5 తో ఆండ్రాయిడ్ 11 లో రన్ అవుతూ 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) 10-బిట్ ఫ్లాట్ AMOLED ట్రూ-కలర్ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM తో జత చేయబడి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, IR బ్లాస్టర్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది మరియు డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. Xiaomi 11 లైట్ 5G NE 4,250mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

-->
Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X
X