అలా చేస్తే.. iPhone 13 మొబైల్‌ను అమెజాన్‌లో రూ.55 వేల‌కే కొనొచ్చు!

|

భార‌త 75వ ఇండిపెండెన్స్ డే ను పుర‌స్క‌రించుకుని Amazon గ్రేట్ ఫ్రీడం ఫెస్టివ‌ల్ సేల్ 2022 ను ప్రారంభించ‌బోతోంది. అయితే, ఈ సేల్‌లో భాగంగా Apple కంపెనీకి చెందిన iPhone 13 పై ఊహించ‌ని డిస్కౌంట్ ల‌భించ‌నుంది. దాని సాధార‌ణ ధ‌ర‌తో పోల్చితే దాదాపు రూ.20వేల కు పైగా డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

 
అలా చేస్తే.. iPhone 13 మొబైల్‌ను అమెజాన్‌లో రూ.55 వేల‌కే కొనొచ్చు!

Apple కంపెనీకి చెందిన iPhone 13 స్మార్ట్‌ఫోన్ యొక్క 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ఒరిజిన‌ల్ ధ‌ర రూ.79,900 ఉండ‌గా.. ఇది Amazon Great Freedom Festival Sale 2022 లో భాగంగా రూ. 68,900 ధరకు విక్రయించబడుతోంది. అంటే దాదాపు ఈ ఆఫ‌ర్‌లో భాగంగా రూ.11 వేలు డిస్కౌంట్ ల‌భించ‌నుంది. అంతే కాకుండా, యాపిల్ కంపెనీ అద‌నంగా రూ.13,050 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా అందిస్తోంది. ఈ రెండు ఆఫ‌ర్ల‌ను వినియోగించుకోవ‌డం ద్వారా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సమయంలో iPhone 13 మొబైల్‌ను కేవ‌లం రూ.55,850కి కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ తగ్గింపు Amazon లోని ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే వ‌ర్తిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇవికాకుండా, కొనుగోలుదారులు ధరను మరింత తగ్గించడానికి ప్ర‌స్తుతానికి ఎలాంటి బ్యాంక్ ఆఫర్‌లు లేవు. ప్రైమ్ యూజ‌ర్ల‌తో పోలిస్తే.. నాన్-ప్రైమ్ అమెజాన్ వినియోగదారులు సేల్ ఆఫ‌ర్‌లో భాగంగా ఐఫోన్ 13ని రూ.1,000 అధిక ధరకు అన‌గా రూ. 69,900 పొందుతారు. ఈ ఆఫర్ iPhone యొక్క అన్ని వేరియంట్‌లలో చెల్లుబాటు అవుతుంది, 256GB మరియు 512GB వేరియంట్‌లు వరుసగా రూ.76,900 మరియు రూ.1,03,999 ధరలకు లభిస్తాయి.

అలా చేస్తే.. iPhone 13 మొబైల్‌ను అమెజాన్‌లో రూ.55 వేల‌కే కొనొచ్చు!

అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫాంల‌పై ప్ర‌త్యే విక్రయాల సమయంలో ఇటువంటి డీల్‌లు వేగంగా ముగుస్తాయి.. కాబట్టి ఈ డీల్ ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. ఐఫోన్‌కు ఎల్లప్పుడూ భారీ డిమాండ్ ఉండటంతో, కొనుగోలుదారులు ఎల్లప్పుడూ ఇలాంటి ఆఫ‌ర్ల కోసమే వెతుకుతున్నారు. కాబట్టి మీరు క‌నుక ప్ర‌స్తుతం ఐఫోన్ 13 లేదా మ‌రేదైనా మోడ‌ల్‌ను కొనుగోలు చేయాల‌నుకుంటే.. ఇదే స‌రైన స‌మ‌యంగా భావించ‌వ‌చ్చు.

Apple కంపెనీ నుంచి iPhone 13 గత ఏడాది ఆ కంపెనీ సెప్టెంబర్ లో నిర్వ‌హించిన ఈవెంట్ సందర్భంగా లాంచ్ చేయ‌బ‌డింది.
iPhone 13 స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR పానెల్ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది A15 బ‌యోనిక్ చిప్‌ను క‌లిగి ఉంది. ఇది 4జీబీ ర్యామ్, 512జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఐఓఎస్‌ 15 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 3240mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఛార్జ‌ర్ 23వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ Apple A15 బ‌యోనిక్ చిప్‌ను క‌లిగి ఉంది. ఇక కెమెరాల విష‌యానికొస్తే.. దీనికి డ్యుయ‌ల్ కెమెరా సెట‌ప్ అందిస్తున్నారు. బ్యాక్‌సైడ్ రెండు కెమెరాలు కూడా 12 మెగా పిక్సెల్ క్వాలిటీ లెన్స్ క‌లిగి ఉన్నాయి. రెండోది అల్ట్రావైడ్ లెన్స్ క‌లిగి ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్ క్వాలిటీ లెన్స్ క‌లిగి ఉంది.

 
అలా చేస్తే.. iPhone 13 మొబైల్‌ను అమెజాన్‌లో రూ.55 వేల‌కే కొనొచ్చు!

ఇదిలా ఉండ‌గా, యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 13 ఏప్రిల్ నెల‌లో గ్లోబ‌ల్ టాప్ సెల్లింగ్ మొబైల్‌గా రికార్డు సృష్టించింది. అందుకు సంబంధించిన విష‌యాల‌ను కూడా తెలుసుకుందాం:
గ‌త ఏప్రిల్ లో గ్లోబ‌ల్ టాప్ సెల్లింగ్ మొబైల్‌గా iPhone 13 :
గ్లోబ‌ల్ మార్కెట్లో గ‌త ఏప్రిల్‌లో ఎక్కువ‌గా అమ్ముడైన స్మార్ట్ ఫోన్ల‌లో యాపిల్ కంపెనీ తొలి స్థానం సాధించ‌డం విశేషం. యాపిల్ సంస్థ‌కు చెందిన iPhone 13 గ‌త ఏప్రిల్‌లో గ్లోబ‌ల్‌గా అత్య‌ధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ల జాబితాలో తొలి స్థానం పొందింది. ఈ మేర‌కు కౌంట‌ర్‌పార్ట్ అనే సంస్థ ఓ నివేదిక‌లో వెల్ల‌డించింది. ఇత‌ర టెక్ దిగ్గ‌జాల‌తో పోలిస్తే ఏప్రిల్ నెల‌లో యాపిల్ సంస్థ అత్య‌ధిక ఫోన్లు అమ్ముడైన‌ట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో షావోమీ, శాంసంగ్ మొబైల్ కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి. కాక‌పోతే, యాపిల్ గ‌తేడాది మాదిరిగానే తొలి స్థానం సాధించ‌డం విశేషం. ఈ ఏడాది మార్చిలో అన‌గా 2022 మొదటి త్రైమాసికంలో కూడా ఐఫోన్ 13 మ్యాక్స్ మరియు ఐఫోన్ 13 అత్యధికంగా అమ్ముడైన డివైజ్‌లుగా ఉన్నాయని వెల్లడించింది.

అలా చేస్తే.. iPhone 13 మొబైల్‌ను అమెజాన్‌లో రూ.55 వేల‌కే కొనొచ్చు!

యాపిల్‌కు చెందిన మొత్తం ఐదు మోడ‌ల్స్ టాప్ సెల్లింగ్ జాబితాలో ఉన్నాయి. ఐఫోన్ 13 గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 5.5 శాతం వాటాతో జాబితాలో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో iPhone 13 Pro Max ప్రారంభ ధర రూ. 1,27,900 వద్ద విక్రయిస్తోంది. అదేవిధంగా దేశంలో స్టాండ‌ర్ట్‌ iPhone 13 రూ.72,990కి అందుబాటులో ఉంది. జాబితాలోని మిగిలిన డివైజ్‌లు iPhone 13 Pro, iPhone 12 మరియు iPhone SE 2022 లు ఉన్నాయి. Apple iPhone SE 2022 మోడల్‌కి సంబంధించి సమీక్షకుల నుండి మంచి స్పంద‌న రాలేదని తెలుస్తోంది. iPhone SE 2022 టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ ఫోన్‌ల లిస్ట్‌లో 7వ స్థానంలో ఉంది.

Apple iPhone 14 విడుద‌ల ఎప్పుడంటే:
యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ ను కంపెనీ సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌నుంది. కంపెనీ కనీసం నాలుగు కొత్త ఐఫోన్‌లను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. వాటిలో iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max ఉండ‌నున్నాయి.

Best Mobiles in India

English summary
Apple iPhone 13 Exchange Offer, mobile comes at Rs.55,850

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X