Home
Deal of the day

ఐఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అయితే ఐఫోన్ మోడల్‌పై భారీ డిస్కౌంట్‌..!

ఆపిల్‌ ఐఫోన్‌ 17e మోడల్‌ ఇటీవల భారత్‌ మార్కెట్‌లోకి విడుదల అయింది. A19 చిప్‌, iOS 26 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.64900 గా ఉంది. 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. 48MP కెమెరా, 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ విడుదల అనంతరం గత సంవత్సరం లాంచ్‌ అయిన ఐఫోన్ 16e ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.

ప్రస్తుతం విజయ్‌ సేల్స్‌లో ఐఫోన్‌ 16e మోడల్‌ ను (iPhone 16e Smartphone price drop) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో ఈ మోడల్‌ ప్రారంభ ధర రూ.59900 గా ఉండేది. ప్రస్తుతం విజయ్‌ సేల్స్‌లో (Vijay Sales) రూ.52390 గా ఉంది.

iPhone 16e smartphone gets best deal on vijay sales

అదనపు డిస్కౌంట్‌ :
అంటే సుమారు రూ.7 వేలకు పైగా ధర తగ్గింది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రూ.48890 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎక్స్ఛేంజీ ఆఫర్లను కూడా పొందవచ్చు.

సూపర్‌ రెటీనా డిస్‌ప్లే :
ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 60Hz రీఫ్రెష్‌ రేట్‌, 1200 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. అల్యూమినియం బిల్డ్‌, IP68 రేటింగ్‌ తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

A18 చిప్‌సెట్‌ :
ఆపిల్‌ ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్‌ A18 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. iOS 17 పైన పనిచేస్తుంది. అనంతరం OS అప్‌డేట్‌ ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్లను కలిగి ఉంది.

48MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ఒకే కెమెరాను కలిగి ఉంది. ఇందులో 2x ఆప్టికల్‌ జూమ్‌తో 48MP కెమెరా ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 12MP కెమెరా ఉంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌, వైఫై, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

కొత్త ఐఫోన్‌తో పోలిస్తే ఏమేం మార్పులు వచ్చాయి :
అయితే ఇటీవలే ఐఫోన్ 17e స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. ఐఫోన్ 16e మోడల్‌లో లేని మరో ఫీచర్‌ ను కలిగి ఉంది. అదే Magsafe ఫీచర్‌. ఐఫోన్ 17e మోడల్‌ 20W వైర్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుంది. లేటెస్ట్‌ ఐఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 26 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ ను పొందవచ్చని ఆపిల్‌ తెలిపింది.

3 రెట్ల ప్రొటెక్షన్‌ :
దీంతోపాటు ఐఫోన్ 17e డిస్‌ప్లే సిరామిక్‌ షీల్డ్‌ 2 ప్రొటెక్షన్‌ ను కలిగి ఉంది. ఐఫోన్ 16e మోడల్‌ కలిగిన ఉన్న గ్లాస్‌ ప్రొటెక్షన్ తో పోలిస్తే 3 రెట్లు పటిష్ఠంగా ఉంటుందని ఆపిల్‌ చెబుతోంది. దీంతోపాటు యాక్షన్ బటన్ కూడా లేటెస్ట్ ఐఫోన్‌ సొంతం.

More from GizBot

Best Mobiles in India

English summary
apple iPhone 16e smartphone gets best deal on vijay sales after iphone 17e launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X