ఆకట్టుకొనే డిజైన్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ పై రూ.2000 డిస్కౌంట్.. ఆఫర్ మిస్ చేసుకోవద్దు
నథింగ్ సబ్‌బ్రాండ్ CMF నుంచి గత నెలలో CMF ఫోన్ 2 ప్రో లాంచ్ అయింది. రూ.20 వేల కంటే తక్కువ ధరలో ఆకట్టుకొనే డిజైన్, బెస్ట్ ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చింది. నథింగ్ ఫోన్‌ల తరహాలోనే ఆకట్టుకొనే అనేక ఫీచర్‌లు CMF ఫోన్‌లో ఉన్నాయి. అయితే గత సంవత్సరం విడుదల అయిన CMF ఫోన్ 1 ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కస్టమైజ్డ్ బ్యాక్ ప్యానల్‌ను కలిగి ఉంది. దీంతోపాటు అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.
CMF ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15999 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులతో రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఈ ఆఫర్‌లో సీఎంఎఫ్ ఫోన్ 1 హ్యాండ్‌సెట్‌ను రూ.13,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్, ఆరెంజ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ CMF ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
సీఎంఎఫ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
సీఎంఎఫ్ ఫోన్ 1 హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల ఫుల్ HD+ (1080*2400 పిక్సల్స్) అమోలెడ్ LTPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్ తో పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ OS 2.6 ను కలిగి ఉంది. మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 2TB వరకు స్టోరేజీని పొడిగించుకొనే అవకాశం ఉంది. మరియు 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా సీఎంఎఫ్ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 2MP పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చి ఉంది. ఈ కెమెరా విభాగం అల్ట్రా XDR, యాక్షన్ మోడ్ సపోర్టును కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 5G, 4G, బ్లూటూత్ 5.3, వైఫై 6, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్‌ను మార్చుకొనేందుకు అవకాశం ఉంటుంది. బ్లూ, ఆరెంజ్ వేరియంట్స్ వేగాన్ లెదర్ లేయర్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఈ ఫోన్ వేగాన్ లెదర్ ప్యానల్ వేరియంట్ బరువు 207 గ్రాములుగా ఉంది. మరో వేరియంట్ బరువు 197 గ్రాములుగా ఉంది.
గమనిక : గిజ్‌బాట్ వెబ్‌సైట్‌లోని అఫిలియేట్ లింక్స్ ద్వారా చేసిన కొనుగోళ్ల నుంచి కమీషన్‌ను సంపాదిస్తుంది. ఉత్పత్తులకు సంబంధించిన అసలైన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవం ఆధారంగా సిఫార్సు చేయబడతాయి. అది కూడా మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.


Click it and Unblock the Notifications








