రూ.14999 ధరకే 50MP టెలిఫోటో కెమెరా 5G స్మార్ట్‌ఫోన్.. 6 సంవత్సరాల అప్‌డేట్స్, 5000mAh బ్యాటరీ సహా..!
నథింగ్ సంస్థ భారత్ మార్కెట్ లో అనేక మోడల్స్‌ను లాంచ్ చేసింది. అయితే నథింగ్ సబ్‌బ్రాండ్ గా వచ్చిన CMF సంస్థ కూడా ఫోన్‌లతోపాటు ఆడియో ఉత్పత్తులను కూడా లాంచ్ చేసింది. ఈ సంవత్సరం తొలిభాగంలో CMF ఫోన్ 2 ప్రో స్మా్ర్ట్‌ఫోన్ (CMF Phone 2 Pro Smartphone) లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్, 50MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంది. మరియు ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ ల వివరాలు.
రూ.4000 డిస్కౌంట్ :
CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.20,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో భారీ డిస్కౌంట్ ధరకే అందుబాటులో ఉంది. ఏకంగా రూ.4000 డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఫోన్ ధరలు రూ.14999, రూ.16999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ధరలో టెలిఫోటో కెమెరాతోపాటు మంచి సాఫ్ట్‌వేర్ అనుభూతినిచ్చే ఫోన్ కోసం చూస్తుంటే ఈ హ్యాండ్‌సెట్ మీకో మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OS 3.2 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. HDR10+ సపోర్టును కూడా కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.
50MP టెలిఫోటో కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ Truelens ఇంజిన్ 3.0 టెక్నాలజీ ను కలిగి ఉంది.
CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్లాక్, వైట్, లైట్ గ్రీన్, ఆరెంజ్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, Wifi 6 తోపాటు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








