50MP + 50MP + 50MP + 10MP కెమెరాలు, క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే 5G ఫోన్ పై రూ.3 వేల డిస్కౌంట్!
Motorola Edge 60 Pro 5G Smartphone : మోటోరోలా ఈ సంవత్సరం భారత్ మార్కెట్ లో అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ముఖ్యంగా ఎడ్జ్ 60 సిరీస్ నుంచి మోటోరోలా ఎడ్జ్ 60, ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఎడ్జ్ 60 నియో, ఎడ్జ్ 60 ప్రో మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు G సిరీస్‌ను కూడా వివిధ మోడల్స్ విడుదల అయ్యాయి. ప్రస్తుతం ప్రో మోడల్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 60 Pro 5G Smartphone) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.29,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33,999 గా ఉండేది. 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37999 గా ఉండేది.

రూ.3 వేల డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి 2025 సేల్ లో (Flipkart Big Bang Diwali 2025) భాగంగా రూ.3 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ల ధరలు రూ.26999, రూ.30999, రూ.34999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఈ SBI బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్‌ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 + IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ప్రో మోడల్ పాంటోన్ డాజ్లింగ్ బ్లూ, పాంటోన్ షాడో, పాంటోన్ స్పార్క్‌లింగ్ గ్రేప్, పాంటోన్ వాల్‌నట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 1.5k క్వాడ్ కర్వడ్ pOLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను పొందుతోంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ మోటోరోలా ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 Extreme SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని మోటో హామీ ఇచ్చింది.
50MP + 50MP + 10MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంది.
90W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఛార్జర్‌తో తక్కువ సమయంలోనే ఈ బ్యాటరీని ఛార్జింగ్ చేయవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








