Flipkart లో అప్ల‌యెన్సెస్‌పై భారీ డిస్కౌంట్లు.. ఓ లుక్కేయండి!

|

యుగ‌మంతా స్మార్ట్‌గా అభివృద్ధి చెందుతున్నప్పుడు అందుకు త‌గ్గ‌ట్టు జ‌నాలు కూడా మారిపోతున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ నిత్యం ఏదో ఓ స్మార్ట్ థింగ్స్ వినియోగంలో మునిగిపోతున్నారు. ఈ క్ర‌మంలో ఇళ్ల‌లో వినియోగించే అప్ల‌యెన్సెస్ కూడా స్మార్ట్ గానే ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు. అందులో భాగంగా ఇటీవ‌ల స్మార్ట్ టీవీలు, ఆండ్రాయిడ్ టీవీలు, డిజిట‌ల్ రిఫ్రిజ‌రేట‌ర్లు, వాషింగ్ మెషీన్ల‌కు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ క్ర‌మంలో ప‌లు ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల త‌యారీ కంపెనీలు నిత్యం ఏదో ఓ కొత్త మోడ‌ల్ స్మార్ట్ హోం అప్ల‌యెన్సెస్ ను విడుద‌ల చేస్తుండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. కాగా ప్ర‌స్తుతం Flipkart ఈ అప్ల‌యెన్సెస్‌పై ఎల‌క్ట్రానిక్ సేల్ జూన్ 2022 (Electronic Sale June 2022) ప్ర‌క‌టించింది.

5 రోజుల పాటు కొన‌సాగ‌నున్న సేల్‌:
ఈ సేల్ Flipkart లో జూన్ 23 న ప్రారంభం అయి జూన్ 27 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఈ సేల్‌లో భాగంగానే తాజాగా ప‌లు సంస్థల టీవీలు, ఇత‌ర‌త్ర ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తులపై డిస్కౌంట్‌లు అందుబాటులో ఉండ‌నున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల‌కు ఫ్లిప్‌కార్ట్ 10శాతం డిస్కౌంట్ రూ.1,500 వ‌ర‌కు అందిస్తోంది. ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న కొన్ని మంచి అప్ల‌యెన్సెస్ గురించి వాటి ఫీచ‌ర్లు, ధ‌ర‌ల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Vu Premium Ultra HD (4K) LED Smart Android TV:

Vu Premium Ultra HD (4K) LED Smart Android TV:

వీయూ ప్రీమియం అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ (108cm) 43 అంగుళాల స్క్రీన్‌ను క‌లిగి ఉంది. దీని ఒరిజిన‌ల్ ధ‌ర రూ.45,000 కాగా, ఈ ఫ్లిప్‌కార్ట్ ఎల‌క్ట్రానిక్స్ సేల్ జూన్ 2022 లో భాగంగా ఇది కేవ‌లం Rs. 26,999 కే ల‌భించ‌నుంది. యాక్సిస్ బ్యాంకు కార్డు దారుల‌కు అద‌నంగా మ‌రో 5శాతం డిస్కౌంట్ ల‌భించ‌నుంది. ఎక్స్చేంజీ ఆఫ‌ర్ కింద ఫ్లిప్‌కార్ట్‌ దాదాపు రూ.11,600 వ‌ర‌కు ఆఫ‌ర్ ఇవ్వ‌నుంది. ఇది 43 అంగుళాల స్క్రీన్ క‌లిగి ఉండి, 60Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ టీవీ యూట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్‌ల‌ను స‌పోర్ట్ చేస్తుంది.

Mi 5X Ultra HD (4K) LED Smart Android TV

Mi 5X Ultra HD (4K) LED Smart Android TV

ఎంఐ సంస్థ‌కు చెందిన ఈ Mi 5X LED Smart Android TV (108cm) 43 అంగుళాల స్క్రీన్‌ను క‌లిగి ఉంది. దీని ఒరిజిన‌ల్ ధ‌ర రూ.49,999 కాగా, ఈ ఫ్లిప్‌కార్ట్ ఎల‌క్ట్రానిక్స్ సేల్ జూన్ 2022 లో భాగంగా ఇది కేవ‌లం Rs. 31,999 కే ల‌భించ‌నుంది. ఎక్స్చేంజీ ఆఫ‌ర్ కింద ఫ్లిప్‌కార్ట్‌ దాదాపు రూ.8వేల వ‌ర‌కు ఆఫ‌ర్ ఇవ్వ‌నుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డు దారుల‌కు అద‌నంగా మ‌రో రూ.2వేలు డిస్కౌంట్ ల‌భించ‌నుంది. ఈ టీవీ గూగుల్ అసిస్టెంట్, డాల్బీ ఆట‌మ్స్‌, డాల్బీ విజ‌న్ ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. ఈ టీవీ స్పీక‌ర్లు 30వాట్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి.

Realme HD Ready LED Smart Android TV

Realme HD Ready LED Smart Android TV

రియ‌ల్‌మీ సంస్థ‌కు చెందిన ఈ Realme HD LED Smart Android TV, 32 అంగుళాల స్క్రీన్‌ను క‌లిగి ఉంది. దీని ఒరిజిన‌ల్ ధ‌ర రూ.17,999 కాగా, ఈ ఫ్లిప్‌కార్ట్ ఎల‌క్ట్రానిక్స్ సేల్ జూన్ 2022 లో భాగంగా ఇది కేవ‌లం Rs. 15,999 కే ల‌భించ‌నుంది. ఎక్స్చేంజీ ఆఫ‌ర్ కింద ఫ్లిప్‌కార్ట్‌ దాదాపు రూ.8వేల వ‌ర‌కు ఆఫ‌ర్ ఇవ్వ‌నుంది. యాక్సిస్ బ్యాంకు కార్డు దారుల‌కు అద‌నంగా మ‌రో 5శాతం డిస్కౌంట్ ల‌భించ‌నుంది. ఈ టీవీ యూట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్‌ల‌ను స‌పోర్ట్ చేస్తుంది.
ఈ టీవీ స్పీక‌ర్లు 24 వాట్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. యాక్సిస్ బ్యాంకు కార్డు దారుల‌కు అద‌నంగా మ‌రో 5శాతం డిస్కౌంట్ ల‌భించ‌నుంది.

Voltas 1.5 Ton 5 Star Split Inverter AC

Voltas 1.5 Ton 5 Star Split Inverter AC

ఈ సేల్‌లో ఓల్టాస్ 1.5 ట‌న్ స్ల్పిట్ ఇన్వ‌ర్ట‌ర్ ఏసీల‌పై మంచి ఆఫ‌ర్ ల‌భిస్తోంది. ఈ ఏసీ 5స్టార్ రేటింగ్ క‌లిగి ఉంది. ఈ ఏసీ ఒరిజిన‌ల్ ధ‌ర రూ.67,990 ఉండ‌గా, ఈ సేల్ లో ఇది కేవ‌లం రూ.37,999 ల‌కు అందుబాటులో ఉంది. యాక్సిస్ బ్యాంకు కార్డు దారుల‌కు అద‌నంగా మ‌రో 5శాతం క్యాష్‌బ్యాక్ (రూ.1వేయి వ‌ర‌కు) అందుబాటులో ఉండనుంది. ఇది ఆటో రీస్టార్ట్‌, ఆటో టెంప‌రేచ‌ర్ కంట్రోలింగ్ ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది.

Samsung Direct Cool Single Door Refrigerator

Samsung Direct Cool Single Door Refrigerator

ఈ సేల్‌లో శాంసంగ్ 198ఎల్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజ‌రేట‌ర్‌ల‌పై మంచి ఆఫ‌ర్ ల‌భిస్తోంది. ఈ ఫ్రిజ్ 5స్టార్ రేటింగ్ క‌లిగి ఉంది. ఈ ఫ్రిజ్ ఒరిజిన‌ల్‌ ధ‌ర రూ.21,990 ఉండ‌గా, ఈ సేల్ లో ఇది కేవ‌లం రూ.13,490 ల‌కు అందుబాటులో ఉంది. ఎక్స్చేంజీ ఆఫ‌ర్ కింద మ‌రో రూ.12వేల వ‌ర‌కు అద‌నంగా డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. యాక్సిస్ బ్యాంకు కార్డు దారుల‌కు అద‌నంగా మ‌రో 5శాతం క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉండనుంది. ఈ ఫ్రిజ్ 55శాతం ఎనర్జీ సేవింగ్ ఫీచ‌ర్‌ను క‌లిగి ఉంది.

Best Mobiles in India

English summary
Flipkart Electronics Sale June 2022 Goes Live

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X