ధర రూ.10499 కే 108MP కెమెరా, 5030mAh బ్యాటరీ, 6.79 అంగుళాల ఫుల్ HD+ స్మార్ట్‌ఫోన్..!
పోకో నుంచి ఇటీవల కాలంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. పోకో M5 5g, పోకో X7 సిరీస్ సహా గత సంవత్సరం చివరలో పోకో C75 5G, పోకో m7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఇప్పటికే ఇదే సెగ్మెంట్‌లో మరిన్ని బెస్ట్ ఫోన్‌లు ఉన్నాయి. 108MP కెమెరాను కలిగి ఉన్న పోకో M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్ లు, ఫీచర్‌లు, సేల్ పూర్తి వివరాలు.
రెండు స్టోరేజీ వేరియంట్స్ :
భారత్ మార్కెట్‌లో పోకో M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ (Poco M6 Plus 5G Smartphone) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 6GB ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.10499 కే కొనుగోలు చేయవచ్చు.

అదనపు డిస్కౌంట్ :
ఈ ఫోన్ 8GB/128GB వేరియంట్ రూ.13,499 కు విడుదల అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.11,499 కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యా్క్‌ను పొందవచ్చు. గ్రాఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
పోకో M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 AE SoC చిప్‌సెట్ తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం Adreno A613 GPU తో జతచేసి ఉంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందనుంది.

డిస్‌ప్లే వివరాలు :
ఈ పోకో హ్యాండ్‌సెట్ 6.79 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2400*1080 పిక్సల్స్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 550 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణను పొందుతుంది.
108MP కెమెరాలు :
ఈ ఫోన్ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చినా మెరుగైన కెమెరాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలతో అందుబాటులో ఉంది. f/1.75 అపేచర్, 3x ఇన్‌సెన్సార్ జూమ్‌తో 108MP శాంసంగ్ ISOCELL HM6 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.
ఛార్జింగ్, బ్యాటరీ వివరాలు :
దీంతోపాటు 2MP మ్యాక్రో కెమెరాను అమర్చారు. వెనుక వైపు కెమెరాలో 30fps వద్ద 1080p మరియు 720p నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. సెల్ఫీ, వీడియోల కోసం ముందు వైపు f/1.75 అపేచర్‌తో 13MP కెమెరాను కలిగి ఉంది.ఈ ఫోన్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5030mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, WiFi 6, బ్లూటూత్ 5.0, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP53 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.


Click it and Unblock the Notifications








