Home
Deal of the day

ఫ్లిప్‌కార్ట్ సేల్ లో కిల్లర్ డీల్.. 50-అంగుళాల ఏసర్ TV ఇంత తక్కువ ధరకా.. మిస్సైతే లాస్ అయినట్టే..!

Acer G Plus Series 50-Inch TV: బడ్జెట్‌లో అదిరిపోయే హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలా.. ఐతే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఏసర్ G ప్లస్ 50-అంగుళాల 4K టీవీపై కళ్లుచెదిరే ఆఫర్ ఉంది. బ్యాంక్ డిస్కౌంట్లతో ఈ టీవీని మీరు కేవలం రూ.22,749కే సొంతం చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ టీవీ చూడాలనుకునేవారికి, ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే ప్రీమియం ఫీచర్లు కావాలనుకునేవారికి ఇది నిజంగా గోల్డెన్ ఆఫర్. ఈ టీవీ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

* ధర ఎంతంటే..

ఏసర్ G ప్లస్ 50-అంగుళాల టీవీ అసలు ధర అయితే రూ.26,999. కానీ ఫ్లిప్‌కార్ట్ మాత్రం పండగ ఆఫర్ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే ఏకంగా రూ.4,250 డిస్కౌంట్, వేరే క్రెడిట్ కార్డు ఉంటే కూడా రూ.1,000 తగ్గింపు ఇస్తున్నారు.

Flipkart Sale Get Acer G Plus Series 50-Inch TV for Under Rs 23 000  Check Price  Features

అంటే యాక్సిస్ బ్యాంక్ కార్డు వాడితే ఈ టీవీని మీరు జస్ట్ రూ.22,749కే కొనేయొచ్చు. ఇంత తక్కువ ధరకు 50 అంగుళాల 4K టీవీ అంటే సూపర్ డీల్ చెప్పవచ్చు ఇక థియేటర్ కి పోవాల్సిన అవసరం కూడా రాదు. ఓటీటీ సినిమాలు చూస్తూ బాగా ఎంజాయ్ చేయొచ్చు.

* డిస్‌ప్లే & విజువల్స్

ఈ టీవీలో 50-అంగుళాల LED డిస్‌ప్లే ఉంటుంది. 4K అల్ట్రా HD రిజల్యూషన్ (3840 x 2160 పిక్సెల్స్) ఉండటంతో పిక్చర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కలర్స్ కూడా చాలా రిచ్‌గా, సహజంగా కనిపిస్తాయి. మూవీస్, వీడియో గేమ్స్ ఆడేటప్పుడు ప్రతి ఫ్రేమ్ స్మూత్‌గా ఉండటానికి 60Hz రిఫ్రెష్ రేట్ ఉంది.

HDR 10 సపోర్ట్‌తో కాంట్రాస్ట్, కలర్స్ మరింత డీప్‌గా ఉంటాయి. 1.07 బిలియన్ కలర్స్ డిస్‌ప్లే చేయగలగడం వల్ల విజువల్స్ చాలా ప్రత్యక్షంగా చూసినట్లు అనిపిస్తాయి. ఫ్రేమ్‌లెస్ డిజైన్‌తో టీవీ చూస్తుంటే ఒక సినిమా హాల్‌లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. అంతేకాదు, పిక్చర్ స్టెబిలిటీ కోసం ఇంటెలిజెంట్ ఫ్రేమ్ స్టెబిలైజేషన్ ఇంజన్ కూడా ఉంది.

* ఆడియో & సౌండ్ క్వాలిటీ..

సౌండ్ క్వాలిటీ విషయంలో కూడా ఈ టీవీ అదుర్స్ అనిపిస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో సౌండ్ చాలా క్లారిటీగా, క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. 30W బాక్స్ స్పీకర్లు ఉండటంతో సౌండ్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా వస్తుంది. సినిమాలు చూసినా, పాటలు విన్నా.. సౌండ్ మాత్రం అదిరిపోతుంది. ఇంట్లోనే ఒక చిన్నపాటి థియేటర్ పెట్టుకున్న ఫీలింగ్ వస్తుంది.

* పెర్ఫార్మెన్స్ & సాఫ్ట్‌వేర్..

ఈ టీవీ గూగుల్ TV OSతో వస్తుంది. అంటే మీకు కావాల్సిన యాప్స్ అన్నీ ఈజీగా వాడుకోవచ్చు. స్మూత్ పెర్ఫార్మెన్స్ కోసం క్వాడ్-కోర్ కార్టెక్స్ A55 చిప్‌సెట్, మాలి G31 GPU ఉన్నాయి. 2GB RAM ఉండటంతో మల్టీ-టాస్కింగ్ కూడా చాలా స్పీడ్‌గా ఉంటుంది. యాప్స్, మూవీస్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు.

గూగుల్ కాస్ట్ సపోర్ట్‌తో మీ ఫోన్ స్క్రీన్‌ను టీవీలోకి ఈజీగా మిర్రర్ చేయొచ్చు. అంటే మీ ఫోన్‌లో ఏదైనా సినిమా ఉంటే దాన్ని టీవీలో ఈజీగా చూడొచ్చు. గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ కూడా ఉంది కాబట్టి, నెట్‌ఫ్లిక్స్‌, జియోసినిమా, హాట్‌స్టార్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి యాప్స్‌ను సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

* కనెక్టివిటీ, పోర్ట్స్

ఈ స్మార్ట్ టీవీలో కనెక్టివిటీ ఆప్షన్స్‌కు కూడా కొదవలేదు. వైర్‌లెస్ స్ట్రీమింగ్ కోసం బిల్ట్-ఇన్ Wi-Fi, బ్లూటూత్ ద్వారా ఎక్స్‌టర్నల్ డివైజ్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు, గేమింగ్ కన్సోల్స్, సెట్-టాప్ బాక్స్‌లు, ఇతర డివైజ్‌ల కోసం HDMI, USB, AV, LAN పోర్ట్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ టీవీని మీరు అన్ని విధాలుగా వాడుకోవచ్చు.

* వారంటీ & ఫైనల్ థాట్స్

ఏసర్ G ప్లస్ 50-అంగుళాల టీవీకి 2 ఏళ్ల వారంటీ ఇస్తున్నారు. 43-అంగుళాల టీవీ కంటే పెద్ద స్క్రీన్ కావాలనుకునేవారికి, ఇది నిజంగా బెస్ట్ ఛాయిస్. ఈ ధరకు మిగతా బ్రాండ్లలో మాగ్జిమమ్ 43-అంగుళాల టీవీలే వస్తాయి. కానీ 50-అంగుళాల 4K టీవీ, ఇంత మంచి ఆఫర్‌తో రాకపోవచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart offers Acer 50-inch 4K TV at Rs 22,749 with bank discounts. Features include 4K UHD, HDR10, Dolby Atmos, Google TV. It's a budget-friendly big-screen option.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X