రూ.16,000 ధరలోనే 43 అంగుళాల ఫుల్ HD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్..!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్, ల్యాప్‌ట్యాప్, స్మార్ట్‌టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి సేల్ సమయాల్లో అనేక మంది స్మార్ట్‌టీవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఓటీటీల ప్రభావం సహా ఇతర కారణాలతో స్మార్ట్‌టీవీలను కొనుగోలు చేస్తున్నారు. డిస్కౌంట్ ధరలతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత డిస్కౌంట్‌కు కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో థామ్సన్ FA సిరీస్ 43 అంగుళాల స్మార్ట్‌టీవీపై (Thomson FA series 43 inch FHD smart android TV) డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ టీవీ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. డాబ్లీ డిజిటల్ ప్లస్, ఆండ్రాయిడ్ 11 వంటి ఫీచర్‌లున్నాయి. దీంతోపాటు ఈ టీవీ పుల్ HD స్మార్ట్ ఆండ్రాయిడ్ గా ఉంది. ఈ స్మార్ట్‌టీవీ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

థామ్సన్ FA సిరీస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు :
ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 43 అంగుళాల పుల్ HD LED (1080*1920 పిక్సల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 60Hz రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ గరిష్ట డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే ఈ డిస్‌ప్లేను అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. అత్యంత మెరుగైన అనుభూతిని ఇస్తుందని సంస్థ చెబుతోంది.
ఈ థామ్సన్ స్మార్ట్‌టీవీ డిజైన్ పరంగానూ ఆకట్టుకుంటుంది. బెజెల్ లెస్ డిజైన్‌తో లాంచ్ చేశారు. ఫలితంగా మెరుగైన విజువల్ అనుభూతిని పొందవచ్చు. దీంతోపాటు ప్రాసెసర్ కూడా మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ ఆండ్రాయిడ్ టీవీ రియల్‌టెక్ చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 11 OS ను కలిగి ఉంది.
ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీ గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్‌కాస్ట్ సపోర్టును పొందుతుంది. మరియు అత్యంత మెరుగైన సౌండ్ అనుభూతిని కూడా అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ డిజిటల్ ప్లస్, DTS సపోర్టుతో 30W స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఫలితంగా మెరుగైన ఆడియో అవుట్‌పుట్ మీ సొంతం కానుంది.
ఈ స్మార్ట్‌టీవీ గేమింగ్ కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు ఓటీటీ పరంగాను అనుకూలంగా ఉంటుంది. జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, Zee5 వంటి ఓటీటీలతోపాటు యూట్యూబ్ ను కూడా సపోర్టు చేస్తుంది.
అదే కనెక్టివిటీ పరంగా వైఫై, బ్లూటూత్, HDMI పోర్ట్, USB పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. వాయిస్ కంట్రోల్‌తోనూ ఈ టీవీని ఆపరేట్ చేయవచ్చు. ఈ స్మార్ట్ రిమోట్‌లో ఇంకా అనేక ఫీచర్‌లు ఉన్నాయి. ఓటీటీల కోసం ప్రత్యేక బటన్ కూడా ఉంది.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ థామ్సన్ FA సిరీస్ 43 అంగుళాల FHD ఆండ్రాయిడ్ టీవీ ధర రూ.16499 గా ఉంది. బ్యాంకు ఆఫర్లతో గరిష్ఠంగా రూ.1250 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ స్మార్ట్‌టీవీ ధర రూ.15249 గా ఉంటుంది. ఈ ధరలో 43 అంగుళాల టీవీ ని సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








