గూగుల్ పిక్సల్ ఫోన్‌పై రూ.5 వేల డిస్కౌంట్.. 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ సహా సూపర్ ఫీచర్లు..!
Google Pixel 9a Smartphone : టెక్ దిగ్గజం గూగుల్ ఈ సంవత్సరం తొలిభాగంలో గూగుల్ పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ ను భారత్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ టెన్సార్ G4 చిప్‌తో పనిచేస్తోంది. 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. నాలుగు కలర్ వేరియంట్స్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయవచ్చు.
రూ.5 వేల ధర తగ్గింపు :
భారత్ మార్కెట్‌లో ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.49999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.5 వేల డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. అంటే రూ.44999 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు HDFC క్రెడిట్ కార్డుల EMI లావాదేవీలపై రూ.5000 డిస్కౌంట్ ను పొందవచ్చు.

మొత్తంగా రూ.10 వేల డిస్కౌంట్ :
అంటే మొత్తంగా రూ.10,000 వరకు డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉంది. అంటే రూ.39999 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ గూగుల్ పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ ఐరిస్, ఒబ్సిడియన్, పార్సిలియన్ కలర్ వేరియంట్స్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
గూగుల్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు :
గూగుల్ పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.3 అంగుళాల Actua pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2700 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గ్లా్స్ 3 ప్రొటెక్షన్‌ను పొందుతోంది.
7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ Tensor G4 చిప్‌సెట్ ను కలిగి ఉంది. దీంతోపాటు టైటాన్ M2 సెక్యూరిటీ కో ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ 7 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని గూగుల్ హామీ ఇచ్చింది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఆటోఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 48MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 120 డిగ్రీల ఫీల్డ్‌వ్యూ, 8x సూపర్ రిజల్యూషన్ తో 13MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది.
ఈ వెనుక వైపు ఉన్న కెమెరాలు 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ Night sight, Reimagine, Best Take, Photo unbulr, పొర్ట్రెయిట్ లైట్, Magic Eraser వంటి ఫీచర్లు ఉన్నాయి.
వైర్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు :
గూగుల్ పిక్సల్ ఫోన్ 23W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీని కలిగి ఉంది. 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది. 5G, 4G, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, GPS, NavlC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








