వాలెంటైన్స్ డే 2022 గిఫ్ట్ స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు...
స్మార్ట్‌ఫోన్ల వినియోగం ప్రస్తుత రోజులలో సర్వసాధారణం అయింది. ప్రస్తుతం జేబులో స్మార్ట్‌ఫోన్ లేనిదే ఎవరూ కూడా బయటకు రావడం లేదు. డిజిటల్ పరంగా కూడా అభివృద్ధి చెందడంతో ప్రతి ఒక్కరు బయట చెల్లింపుల కోసం గూగుల్ పే, ఫోన్ పే వంటి OTT యాప్ లను ఉపయోగిస్తున్నారు. కావున స్మార్ట్‌ఫోన్ వినియోగం అనేది సర్వసాధారణం అయింది. ప్రస్తుతం రూ.6000 బడ్జెట్ ధరలో కూడా స్మార్ట్‌ఫోన్లు లభిస్తున్నాయి. మీ మనసుకు బాగా నచ్చిన లేదా మీ యొక్క భాగస్వామికి ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ సందర్భంగా ఏదైనా మరచిపోలేని ఒక బహుమతిని కొనుగోలు చేయాలనీ చూస్తుంటే కనుక అనుక్షణం అవసరమయ్యే స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం ఉత్తమం. వాలెంటైన్స్ డే సందర్భంగా అమెజాన్ లో అత్యుత్తమ డీల్‌లతో మీరు పొందగలిగే టాప్ స్మార్ట్‌ఫోన్ల జాబితాలలో అనేక బ్రాండ్‌లు ఉన్నాయి. ఈ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు మీద ఎంపిక చేసిన ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కొనుగోలు మీద 10% ఇన్స్టెంట్ తగ్గింపు ఆఫర్‌లతో పాటుగా అమెజాన్ కూపన్లను అందిస్తున్నది. అలాగే అదనంగా 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్‌సంగ్ గెలాక్సీ M12 ధర రూ.10,999
శామ్‌సంగ్ గెలాక్సీ M12 స్మార్ట్ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఆప్షన్ రూ.10,999 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.13,499 ధర వద్ద బ్లాక్, బ్లూ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత వన్ UI కోర్ OS తో రన్ అవుతూ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్‌ను కలిగి ఉండి ఎక్సినోస్ 850 SoC చేత శక్తిని పొందుతూ 6GB RAM వరకు జతచేయబడి ఉంటుంది. ఇది 6.5-అంగుళాల HD + TFT ఇన్ఫినిటీ-V డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ మరియు 20:9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో మరియు 123-డిగ్రీల వీక్షణతో 5 మెగాపిక్సెల్ సెకండరీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2- మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో వాటర్‌డ్రాప్ తరహా గీత లోపల 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
వన్‌ప్లస్ 9R 5G ధర రూ.39,999
వన్‌ప్లస్ 9R 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.39,999 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ రూ.43,999 ధర వద్ద కార్బన్ బ్లాక్ మరియు లేక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 240HZ టచ్ శాంప్లింగ్ రేట్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డాల్బీ ఆడియోతో శక్తివంతమైన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మల్టీ-లేయర్ కూలింగ్ వ్యవస్థను దాని లీగ్‌లో కలిగిన ఉత్తమ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. అదనంగా ఇది 6.55-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే అల్ట్రా-స్మూత్ స్క్రోలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ శక్తివంతమైన 65W వార్ప్ ఛార్జ్ టెక్నాలజీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది మీకు కేవలం 15 నిమిషాల్లోనే ఒక రోజు మొత్తానికి కావలసిన ఛార్జీని పూర్తి చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ వన్‌ప్లస్ 9R 5G ఫోన్ వెనుక భాగంలో 48MP సోనీ IMX586 ప్రైమరీ సెన్సార్‌తో నడిచే అధునాతన క్వాడ్-కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ లో 16MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో షూటర్ మరియు అంకితమైన మోనో షూటర్ కూడా ఉన్నాయి.
Tecno Spark Go 2022
Tecno Spark Go 2022 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో 2GB ర్యామ్ + 32GB స్టోరేజ్ వేరియంట్ రూ.7,499 ధర వద్ద టర్కోయిస్ సియాన్ మరియు అట్లాంటిక్ బ్లూ కలర్‌వేస్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 6.52-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇక్కడ రిఫ్రెష్ రేట్ 60Hz మరియు 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉండి క్వాడ్-కోర్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. అయినప్పటికీ MediaTek Helio A22 SoC ద్వారా రన్ అవుతుంది. ఈ ఫోన్ 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ ను విస్తరించవచ్చు. ఇది 2GB RAMతో వస్తుంది కాబట్టి సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే Spark Go 2022 Android 11 Go ఎడిషన్‌పై HiOS 7.6 స్కిన్‌పై రన్ అవుతుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే Tecno Spark Go 2022 స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 13MP ప్రైమరీ రియర్ కెమెరా మరియు సెకండరీ AI లెన్స్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది . సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8MP స్నాపర్ కలిగి ఉంటుంది.
ఒప్పో A74 5G ధరలు రూ.14,990
ఒప్పో A74 5G స్మార్ట్‌ఫోన్ 6GB + 128GB వేరియంట్ రూ.17,990 ధరల వద్ద లభిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్‌ఓఎస్ 7.1 తో రన్ అవుతూ 1,080x2,400 పిక్సెల్స్ పరిమాణంలో 6.5-అంగుళాల డిస్ప్లేని 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో కలిగి ఉన్న ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత శక్తిని పొందుతూ 8GB RAMతో జత చేయబడి ఉంటుంది. వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకారంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 12 మెగాపిక్సెల్ సెన్సార్ తో మెయిన్ కెమెరా, అల్ట్రా-వైడ్ లెన్స్ సెన్సార్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. వీటితో పాటుగా 2 మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్లతో కూడిన రెండు కెమెరాలను కూడా కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. అలాగే కనెక్టివిటీ ఎంపికలలో ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ ను కలిగి ఉంది. అలాగే వై-ఫై, LTE, బ్లూటూత్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. చివరగా ఈ ఫోన్ 162.0x75.5x8.9mm కొలతలతో 192 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
ఒప్పో A15s ధర రూ.12,490
ఒప్పో A15s స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,490 ధర వద్ద ఇప్పుడు అమెజాన్ లో డైనమిక్ బ్లాక్ మరియు ఫ్యాన్సీ వైట్ అనే రెండు కలర్ వేరియంట్లలో ఆఫర్‌ల భాగంగా లభిస్తుంది. డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై కలర్ OS 6.1 తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 19: 9 కారక నిష్పత్తితో మరియు 720x1,520 పిక్సెల్స్ సాంద్రతతో 6.52-అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P35 SoCని కలిగి ఉండి 4GB వరకు RAMతో జతచేయబడి వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 లెన్స్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 లెన్స్ 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS / A-GPS మరియు మైక్రో-USB పోర్ట్ వంటివి ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అమర్చబడి ఉండి ఇది 4,320mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications