Just In
- 11 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- News
Lady: విదేశాల్లో ఉద్యోగం, బ్రిటీష్ అధికారులు అని చెప్పి ఏం చేశారంటే, ఐటీ హబ్ లో !
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Movies
Pathaan Day 2 Collections: షారుక్ బాక్సాఫీస్ బీభత్సం.. 2 రోజుల్లో రూ. 200 కోట్లు
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Flipkart లో 5G మొబైల్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు.. పండగ సీజన్ షురూ!
దేశంలో పండగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ భారీ సేల్‌కు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 23న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 ప్రారంభం కానుంది. దాదాపు ఏడు రోజుల పాటు ఈ సేల్ కొనసాగి సెప్టెంబర్ 30వ తేదీన ముగుస్తుంది. అయితే, ఈ సేల్‌లో భాగంగా యూజర్లు కళ్లు చెదిరే ఆఫర్లను పొందనున్నారు. వివిధ కంపెనీలకు చెందిన పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ఈ సేల్‌లో లభించనున్నాయి. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ప్రత్యేకమైన డీల్‌లను అందించనున్నారు. బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు మరియు స్మార్ట్‌వాచ్‌లను ఉత్తమ ఆఫర్‌లలో కొనుగోలు చేసే అవకాశాన్ని మీకు అందిస్తుంది.

ప్రతి సంవత్సరం మాదిరిగానే షాపింగ్ ఈవెంట్‌లో డీల్‌లు మరియు ఆఫర్‌ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. మేము అన్ని కేటగిరీలలోని ఉత్పత్తులపై బెస్ట్ డీల్‌లను జాబితా చేశాం. స్మార్ట్‌ఫోన్‌లతో మొదలుకుని, ఈ సంవత్సరం బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ఉండబోయే అన్ని ఉత్తమమైన డీల్‌లు ఇక్కడ అందిస్తున్నాం. ఈ పండుగ సీజన్‌లో ఉత్తమమైన డీల్‌ను పొందడంలో మీకు సహాయపడటానికి మేము వివిధ బ్రాండ్‌ల నుండి అత్యుత్తమ మరియు అత్యంత సరసమైన 5G స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను ఇక్కడ పేర్కొన్నాం. మీరు కూడా ఓ లుక్కేయండి.

POCO M4 5G (సేల్ ధర: Rs. 9,749):
POCO M4 5G సేల్ ఈవెంట్‌లో ఎప్పుడూ లేనంత తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ 5G హ్యాండ్‌సెట్ కేవలం రూ. 9,749 కే అందుబాటులో ఉండనుంది. దీని MRP ధర వచ్చేసి రూ.15,999గా ఉంది. ఇది దేశంలో అత్యంత సరసమైన 5G స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. POCO M4 5G మొబైల్ 6.58-అంగుళాల పూర్తి HD+ 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు ఇది MediaTek డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

realme 9i 5G (సేల్ ధర: Rs. 10,999):
realme 9i 5G మొబైల్ సేల్‌లో రూ.10,999 కు అందుబాటులో ఉండనుంది. దీని MRP ధర వచ్చేసి రూ.17,999గా ఉంది. realme 9i 5G డైమెన్సిటీ 810 5G-ఆధారిత హ్యాండ్‌సెట్‌గా ఉండబోతోంది. మరియు లేజర్ లైట్ డిజైన్‌తో వస్తుంది.

Samsung Galaxy F23 5G (సేల్ ధర: Rs. 10,999):
Samsung Galaxy F23 5G బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో కేవలం రూ.10,999 కే లభించనుంది. దీని MRP ధర వచ్చేసి రూ.22,999గా ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750G ద్వారా ఆధారితమైన ఈ హ్యాండ్‌సెట్ 50MP ట్రిపుల్-లెన్స్ కెమెరాను కలిగి ఉంది మరియు భారీ 5,000mAh బ్యాటరీ నుండి శక్తిని పొందుతుంది.

vivo T1 5G (సేల్ ధర: Rs. 13,999):
vivo T1 5G మొబైల్ కేవలం రూ.13,999 కు లభించనుంది. దీని MRP ధర వచ్చేసి రూ.19,999గా ఉంది. హ్యాండ్‌సెట్ Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్‌తో ఆధారితమైనది మరియు 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఇది స్లిమ్మెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.

moto g62 5G (సేల్ ధర: Rs. 14,499):
మోటో నుంచి ఇటీవల ప్రారంభించబడిన ఆండ్రాయిడ్ మోటో g62 5Gని తక్కువ ధర రూ.14,499 తో కొనుగోలు చేయవచ్చు. దీని MRP ధర వచ్చేసి రూ.21,999గా ఉంది. ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్‌తో మద్దతునిస్తుంది మరియు 120 Hz FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Xiaomi 11i HyperCharge 5G (సేల్ ధర: Rs. 19,999):
Xiaomi నుంచి అత్యధికంగా అమ్ముడైన 5G స్మార్ట్‌ఫోన్ - Xiaomi 11i హైపర్‌ఛార్జ్ 5G. ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఫ్లాగ్‌షిప్ MediaTek Dimensity 920 5G ప్రాసెసర్‌తో ఆధారితమైన ఈ హ్యాండ్‌సెట్ విక్రయ ధర కేవలం రూ.19,999 గా ఉండనుంది. దీని MRP ధర వచ్చేసి రూ.31,999గా ఉంది.
realme 9 Pro 5G (సేల్ ధర: Rs. 14,999):
realme 9 Pro 5G, కేవలం బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో రూ.14,999 లభించనుంది. దీని MRP ధర వచ్చేసి రూ.31,999గా ఉంది. హ్యాండ్‌సెట్ 6.6-అంగుళాల 120Hz అల్ట్రా-స్మూత్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 64MP + 8MP + 2MP ట్రిపుల్-లెన్స్ కెమెరాను కలిగి ఉంది.

ల్యాప్‌టాప్‌లపై డీల్స్:
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ల్యాప్‌టాప్ల కొనుగోలుకు అత్యంత అనుకూలమైన సమయం. ఏడు రోజుల సేల్ ఈవెంట్‌లో, మీరు లేటెస్ట్ జెనరేషన్ తో ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇచ్చే, వేగవంతమైన రిఫ్రెష్ రేటు మరియు స్టైలిష్ డిజైన్ కలిగిన నోట్‌బుక్‌లను కొనుగోలు చేయగలుగుతారు. ఇందులో భాగంగా మీరు ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్‌లు కొనుగోలు పై దాదాపు 40శాతం వరకు డిస్కౌంట్లు పొందుతారు. అంతేకాకుండా, ఎక్స్‌చేంజ్ మరియు నో-కాస్ట్ EMI ప్లాన్‌లను కూడా దక్కించుకోగలుగుతారు.
1. HP Pavilion R5 | GTX 1650 ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.49,990 గా ఉండనుంది.
2. Lenovo 11th Gen i3 | 512 GB SSD ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.35,990 గా ఉండనుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470