Home
Deal of the day

108MP కెమెరా ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్‌.. ప్రత్యేక గేమింగ్‌ మోడ్‌, సూపర్‌ ఫీచర్లు..!

ఇన్ఫినిక్స్ సంస్థ 108MP కెమెరా సహా వేపర్ కూలింగ్ ఛాంబర్‌ తో ఈ సంవత్సరం జున్‌ లో ఇన్ఫినిక్స్ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ( Infinix GT 30 Pro 5G Smartphone ) అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు పూర్తి వివరాలు.

రూ.3000 డిస్కౌంట్‌ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్‌ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26999 గా ఉంది. SBI క్రెడిట్‌ కార్డులపై గరిష్ఠంగా రూ.3000 వరకు డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Infinix GT 30 Pro 5G smartphone gets Rs3000 discount on SBI Card on flipkart

1.5K అమోలెడ్‌ డిస్‌ప్లే :
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.78 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేను (Always On Display) కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 2160Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ ను పొందుతుంది.

ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అల్టిమేట్‌ SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR5x ర్యామ్‌, 256GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత XOS 14 పైన పనిచేస్తోంది. థర్మల్‌ మెనేజ్‌మెంట్‌ కోసం AI ఆధారిత VC కూలింగ్ సిస్టమ్‌ ను కలిగి ఉంది.

108MP కెమెరా :
ఈ స్మార్ట్‌ఫోన్ 120fps తో BGMI ను సపోర్టు చేస్తుంది. మరియు XBoost గేమింగ్‌ ఇంజిన్‌, ఇ-స్పోర్ట్స్‌ మోడ్‌ ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 108MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ను కలిగి ఉంది. ముందు వైపు 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

5500mAh బ్యాటరీ :
ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ 45W వైర్‌, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. Hi-Res ఆడియో సపోర్టుతో డ్యూయల్‌ స్పీకర్‌లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ సర్కిల్ టూ సెర్చ్‌, AI Note, Writing Assistant, పోలెక్స్‌ ఏఐ అసిస్టెంట్‌ ఉన్నాయి.

ఈ ఇన్ఫినిక్స్‌ GT 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ బ్లేడ్‌ వైట్, డార్క్‌ ఫ్లేర్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తోంది. బ్లేడ్‌ వైట్‌ కలర్‌ వేరియంట్ వైట్‌ LED లైట్‌ ప్యానల్‌, డార్క్ ఫ్లేర్‌ కలర్‌ వేరియంట్‌ RGB LED లైట్‌ ప్యానల్‌ ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్‌ 5.4, Wi-Fi 6, GPS, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Infinix GT 30 Pro 5G smartphone gets Rs3000 discount on SBI Cards on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X