రూ.10 వేల ధరలో ఆకట్టుకొనే డిజైన్, 50MP కెమెరా, 5200mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ భారత్ మార్కెట్ లో ఈ సంవత్సరం జులై నెలలో ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. రూ.10 వేల ధరలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ లను కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP కెమెరా, 5200mAh బ్యాటరీని కలిగి ఉంది.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ స్మార్ట్‌ఫోన్ (infinix Hot 60 5G+ Smartphone) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10499 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను పొందవచ్చు. రూ.10 వేలలో 5G ఫోన్ కోసం చూస్తుంటే ఈ హ్యాండ్‌సెట్ ను మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు.

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ షాడో బ్లూ, స్లీక్ బ్లాక్, టండ్ర గ్రీన్, కారమెల్ గ్లో కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 6GB LPDDR45x ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ కస్టమైజ్ AI బటన్ ను కలిగి ఉంది. ఈ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా ఇన్ఫినిక్స్ AI వాయిస్ అసిస్టెంట్ Folax ను యాక్టివేట్ చేయవచ్చు.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP కెమెరా అమర్చి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక కెమెరాలు బ్యూటీ పొర్ట్రెయిట్స్, Slow Motion, Super Night, స్కై షాప్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ మోడ్ వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.

5200mAh బ్యాటరీ :
ఈ ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ స్మార్ట్‌ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ బైపాస్ ఛార్జింగ్ సపోర్టు, రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ సర్కిల్ టూ సెర్చ్, AI Writing Assistant, AI Call Assistant వంటి ఫీచర్లున్నాయి.
ఈ హ్యాండ్‌సెట్ XBoost AI గేమ్ మోడ్, HyperEngine 5.0 Lite గేమింగ్ టెక్నాలజీ కూడా ఉంది. మరియు 90fps గేమింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ద్వారా బలహీనమైన నెట్‌వర్క్, పూర్తిగా నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లోనూ కాల్స్ చేసుకోవచ్చు. అల్ట్రాలింక్ కనెక్టివిటీ ఫీచర్ ద్వారా ఇది సాధ్యమైంది. రెండు ఇన్ఫినిక్స్ డివైజ్‌ల మధ్యనే ఈ ఫీచర్ పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








