రూ.8 వేల కంటే తక్కువ ధరలో మొబైల్ కోసం చూస్తున్నారా..?
భారత్ మార్కెట్‌లో ఇన్ఫినిక్స్ సంస్థ ఇటీవల కాలంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. గత సంవత్సరం రెండో భాగంలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 మోడల్‌ను (infinix Smart 10 Smartphone) ఎంట్రీ లెవల్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ HD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, నెట్‌వర్క్ లేకున్నా కాల్స్ చేసుకొనే ఫీచర్ కూడా ఉంది. రూ.8 వేల కంటే తక్కువ ధరలో మొబైల్ కోసం చూస్తున్న వారు ఈ హ్యాండ్‌సెట్‌ను పరిశీలించవచ్చు.
రూ.7999 ప్రారంభ ధరకు :
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7999 గా ఉంది. ఈ ఫోన్ ట్విలైట్ గోల్డ్, టైటానియం సిల్వర్, ఐరిస్ బ్లూ, స్లీక్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఆండ్రాయిడ్ 15 OS :
ఇన్పినిక్స్ స్మార్ట్ 10 ఆక్టాకోర్ Unisoc T7250 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 4GB LPDDR4x ర్యామ్, 64GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15.1 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ మైక్రో SD కార్డును కూడా సపోర్టు చేస్తుంది.
అల్ట్రా లింక్ ఫీచర్ :
ఈ హ్యాండ్‌సెట్ అల్ట్రా లింక్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా నెట్‌వర్క్ కవరేజీ తక్కువగా ఉన్నా లేదా పూర్తిగా నెట్‌వర్క్ లేకపోయినా ఈ ఫీచర్‌ను ఉపయోగించి కాల్స్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీచర్‌తో రెండు ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్‌ల మధ్య మాత్రమే కాలింగ్‌కు అవకాశం ఉంటుంది.
HD+ డిస్‌ప్లే :
ఇన్పినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 700 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ డ్రాప్ రెసిస్టెంట్‌గా ఉంది. ఫలితంగా పొరపాటున కిందపడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశం ఉంటుంది.
Folax AI వాయిస్ అసిస్టెంట్ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 8MP కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 30fps వద్ద 2K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. Folax AI వాయిస్ అసిస్టెంట్, డాక్యుమెంట్ అసిస్టెంట్, రైటింగ్ అసిస్టెంట్ వంటి అనేక AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్లను కలిగి ఉంది.
ఛార్జింగ్ సపోర్టు :
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 15W ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 8MP కెమెరా, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ Folax AI వాయిస్ అసిస్టెంట్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ రైటింగ్ అసిస్టెంట్, డాక్యుమెంట్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మెరుగైన ఆడియో సపోర్టు కోసం డ్యూయల్ DTS స్పీకర్లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 4G, వైఫై, బ్లూటూత్, GPS, FM, 3.5mm ఆడియో జాక్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








