Home
Deal of the day

iPhone 15 ప్లస్ పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.11,410 తగ్గింపు.. ఈ బంపర్ డీల్ ఎలా పొందాలంటే..?

iPhone 15 Plus Price Drop : మీరు కొత్త ఐఫోన్ కొనాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే మీకు బెస్ట్ టైమ్. ఎందుకంటే యాపిల్ (Apple) ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus) ధర భారీగా తగ్గింది. ఏకంగా రూ.11,410 డిస్కౌంట్ లభిస్తోంది. మార్కెట్లోకి రూ.79,900 ధరకు వచ్చిన ఈ పాపులర్ మోడల్, ఇప్పుడు క్రోమా (Croma)లో రూ.70,000 కంటే తక్కువకే దొరుకుతోంది.

* క్రోమాలో ఐఫోన్ 15 ప్లస్ ధర ఎంతంటే..?
అదిరిపోయే ఫీచర్లు, సూపర్ బ్యాటరీ లైఫ్, కళ్లు చెదిరే డిజైన్‌తో ఐఫోన్ 15 ప్లస్.. 2025, ఏప్రిల్ నాటికి కూడా ఒక మంచి ఎంపికే. మరి ఈ అద్భుతమైన ఆఫర్ పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. ప్రస్తుతం క్రోమా (Croma) వెబ్‌సైట్ లేదా స్టోర్లలో ఐఫోన్ 15 ప్లస్ (128GB వేరియంట్) ధర రూ.71,490గా చూపిస్తోంది.

iPhone 15 Plus Price Slashed by Rs 11410

అంటే, అసలు ధరపై నేరుగా రూ.8,410 తక్షణ డిస్కౌంట్ లభిస్తోంది. ఇది మాత్రమే కాదు, మీరు ఎంపిక చేసిన కొన్ని బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే, అదనంగా మరో రూ.3,000 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంటే, మొత్తం మీద ఫోన్ మీకు సుమారుగా రూ.68,490కే వస్తుంది.

అంతేకాదు, అర్హత కలిగిన క్రెడిట్ కార్డులు వాడితే సులభ వాయిదాల (Low-cost EMI) లేదా వడ్డీ లేని వాయిదాల (No-cost EMI) సౌకర్యం కూడా ఉంది. ఈ బంపర్ డిస్కౌంట్ 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లపై అందుబాటులో ఉంది. ఇంకా అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే, ఫోన్ కండిషన్‌ను బట్టి క్రోమా గరిష్టంగా రూ.60,766 వరకు ఎక్స్ఛేంజ్ విలువను కూడా అందిస్తోంది. మీ ఫోన్‌కు అదనపు రక్షణ కావాలనుకుంటే, కొంత అదనపు మొత్తం చెల్లించి యాపిల్ కేర్+ (Apple Care+) ప్లాన్‌ను కూడా తీసుకోవచ్చు. క్రోమా లో ఐఫోన్‌ 15 ప్లస్‌ ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్‌ చేయండి.

* ఐఫోన్ 15 ప్లస్ ఇప్పటికీ ఎందుకు బెస్ట్ ఆప్షన్..
2023లో విడుదలైనా, ఐఫోన్ 15 ప్లస్ ఇప్పటికీ పనితీరులో అదరగొడుతోంది. ఇందులో శక్తివంతమైన ఏ16 బయోనిక్ (A16 Bionic) చిప్ ఉంది. దీనివల్ల రోజువారీ పనులు, గేమింగ్, హెవీ యాప్స్ వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇది పెద్ద 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR (Super Retina XDR) OLED డిస్ ప్లేతో వస్తుంది.

వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడటానికి బాగుంటుంది. ఈ ఫోన్‌తోనే యాపిల్ డైనమిక్ ఐలాండ్ (Dynamic Island) ఫీచర్‌ను ప్లస్ మోడల్‌కు కూడా తెచ్చింది, దీనిలోనే 12MP ఫ్రంట్ కెమెరా అమర్చబడి ఉంటుంది. కెమెరాల విషయానికొస్తే, వెనుక వైపు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.

* బ్యాటరీ లైఫ్
ఐఫోన్ 15 ప్లస్‌లో అన్ని ఐఫోన్ 15 మోడళ్లలోకెల్లా దీనికే బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 26 గంటల వరకు వీడియోలు చూడొచ్చు, 100 గంటల వరకు పాటలు వినొచ్చు. ఛార్జింగ్ కోసం 20W యూఎస్‌బి టైప్-సి (USB Type-C) పోర్ట్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

* గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు
ఐఫోన్ 15 ప్లస్ చాలా మంచి ఫోనే అయినా, కొన్ని లేటెస్ట్ ఫీచర్లు ఇందులో మిస్ అవుతాయి. ఇందులో 120Hz ప్రోమోషన్ (ProMotion) డిస్‌ప్లే లేదు. అంటే, హై రిఫ్రెష్ రేట్ వల్ల వచ్చే సూపర్ స్మూత్ స్క్రోలింగ్ అనుభూతి ఉండదు.

అలాగే, ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్‌తో వచ్చిన కొత్త యాపిల్ ఇంటెలిజెన్స్ (Apple Intelligence) ఫీచర్లు దీనికి అప్‌డేట్ ద్వారా లభించవు. మీకు కెమెరాలో 5x ఆప్టికల్ జూమ్ వంటి ప్రొఫెషనల్ ఫీచర్లు కావాలంటే, మీరు ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) మోడల్స్ వైపు చూడాల్సి ఉంటుంది.

గమనిక : గిజ్‌బాట్ వెబ్‌సైట్‌లోని అఫిలియేట్ లింక్స్‌ ద్వారా చేసిన కొనుగోళ్ల నుంచి కమీషన్‌ను సంపాదిస్తుంది. ఉత్పత్తులకు సంబంధించిన అసలైన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవం ఆధారంగా సిఫార్సు చేయబడతాయి. అది కూడా మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.

Best Mobiles in India

English summary
iPhone 15 Plus Price Slashed by Rs 11410, Grab This Massive Croma Deal Under 70k
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X