ఐఫోన్ 16 కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్‌ను మిస్ కావద్దు..!
భారత్ మార్కెట్ లో సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 16 సిరీస్ విడుదల అయింది. ఈ సరీస్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్ హ్యాండ్‌సెట్‌లు సెప్టెంబర్ 20 నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చాయి. అయితే కేవలం రెండు నెలల్లోనే ఐఫోన్ 16 మోడల్‌ను (iPhone 16 Smartphone) తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌ను అందిస్తోంది.
భారత్‌లో విడుదల సమయంలో ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ 128GB ధర రూ.79,990 గా ఉండేది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.89,990, 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,09,900 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 16 బేస్ వేరియంట్‌ను రూ.2000 డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. అంటే ధర రూ.77900 గా ఉంది.

దీంతోపాటు అమెజాన్ పేజీ ఆధారంగా ఐఫోన్ 16 మోడల్‌ను SBI, ICICI బ్యాంకు, కోటక్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లు గరిష్ఠంగా రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ఆఫర్ ద్వారా అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. మొత్తంగా రూ.7000 వరకు తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో ఐఫోన్ 16 (iPhone 16 Smartphone Discount on Amazon) హ్యాండ్‌సెట్ బ్లాక్, అల్ట్రామెరిన్, టీల్, పింక్, వైట్ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.

ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఐఫోన్ 16 మోడల్ 3nm ఆక్టా కోర్ A18 చిప్‌సెట్, iOS 18 పైన పనిచేస్తోంది. 6-కోర్ CPU, 5-కోర్ GPU, 16 కోర్ న్యూట్రల్ ఇంజిన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. మరియు ఈ మోడల్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను సపోర్టు చేస్తోంది.
ఐఫోన్ 16 హ్యాండ్‌సెట్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. కెమెరా కంట్రోల్ బటన్ సహా యాక్షన్ బటన్‌ను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ సిరామిక్ షీల్డ్ రక్షణను కలిగి ఉంది. మరియు డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో అందుబాటులో ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్, వైఫై 6E, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా f/1.6 అపేచర్, 2X ఇన్ సెన్సార్ జూమ్‌తో 48MP వైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు f/2.2 అపేచర్ మరియు ఆటోఫోకస్ ఫీచర్‌తో 12MP అల్ట్రావైడ్ కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP ట్రూ డెప్త్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications