Home
Deal of the day

50MP + 64MP + 50MP కెమెరాలు, 6.78 అంగుళాల డిస్‌ప్లే iQOO స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్.. అమెజాన్‌లో సేల్‌

భారత్‌ మార్కెట్‌లో ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ డిసెంబర్‌ 3 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కొన్ని కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది. అయితే భారత్‌ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 Elite SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 2K LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలిసింది. ఐకూ 13 విడుదల నేపథ్యంలో ఐకూ 12 స్మార్ట్‌ఫోన్‌ను (iQOO 12 Smarrphone Discount Offer) డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయవచ్చు.

ఐకూ 12 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రెండు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఐకూ ఇండియా అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌లో (Amazon) ఈ హ్యాండ్‌సెట్‌పై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఐకూ వెబ్‌సైట్ ఆధారంగా డిస్కౌంట్‌ ఆఫర్‌ ఈనెల 31 వరకు అందుబాటులో ఉంటుంది.

iQOO 12 Smartphone gets RS3000 price discount

ఐకూ 12 స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.52999, 16GB ర్యామ్ వేరియంట్ ధర రూ.57,999 గా ఉంది. ICICI, HDFC బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అమెజాన్‌లో iQOO 12 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్‌ చేయండి.

ఐకూ 12 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1260*2800 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ సహా 3000 నిట్స్‌ గరిష్ఠం బ్రైట్‌నెస్‌ తో అందుబాటులో ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. గ్రాఫిక్స్‌ టాస్క్‌ ఈ చిప్‌సెట్ Adreno 750 GPU తో జతచేసి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత FuntouchOS 14 తో పనిచేస్తోంది. 120W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

iQ00 12 స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3X ఆప్టికల్ జూమ్‌ సామర్థ్యంతో 64MP కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాతో అందుబాటులో ఉంది.

ప్రస్తుతం చైనా మార్కెట్‌లో ఐకూ 13 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ 6.82 అంగుళాల 2K BOE Q10 8T LTPO 2.0 OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 8 Elite SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OriginOS 5 తో పనిచేస్తోంది.

ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ చైనా వేరియంట్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్‌, 50MP అల్ట్రావైడ్‌ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 120W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6150mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO 12 Smartphone gets RS3000 price discount on selected bank cards till end of this month
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X