6400mAh బ్యాటరీ, 50MP కెమెరా. 6.78 అంగుళాల డిస్‌ప్లే 5G ఫోన్‌పై మరో రూ.2500 డిస్కౌంట్..!
iQOO Neo 10R 5G Smartphone : ఐకూ నియో 10R 5G స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం తొలి భాగంలో భారత్ మార్కెట్‌లో లాంచ్ అయింది. హ్యాండ్‌సెట్ ఇటీవలే డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా మరింత అదనపు డిస్కౌంట్‌తో ప్రస్తుతం లభిస్తోంది. ఈ ఫోన్ 50MP కెమెరా, 6400mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు ఈ ఫోన్ 1.5K డిస్‌ప్లే, కాలింగ్ ఛాంబర్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
ప్రస్తుత ధరలు :
ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ (Amazon Diwali Sale 2025) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.26,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.28,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.30,999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో ఈ హ్యాండ్‌సెట్ ధరలు రూ.24998, రూ.26998, రూ.28998 గా ఉన్నాయి.

అంటే విడుదల ధరతో పోలిస్తే రూ.2000 డిస్కౌంట్ ధరతో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దీపావళి సేల్‌లో భాగంగా బేస్ వేరియంట్ పై రూ.2000 కూపన్ కోడ్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే మిగిలిన రెండు వేరియంట్స్ పై రూ.2500 కూపన్ కోడ్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.22998 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మూన్‌లైట్ టైటానియం, రేజింగ్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఐకూ స్మా్ర్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ ను కలిగి ఉంది. దీంతోపాటు Adreno 735 GPU ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.
50MP ప్రైమరీ, 32MP సెల్ఫీ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలున్నాయి. ఇందులో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ AI Erase, Ultra Clear వంటి ఫీచర్లున్నాయి.
6400mAh భారీ బ్యాటరీ :
ఈ ఫోన్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6400mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ అడ్వాన్స్‌డ్ కూలింగ్ టెక్నాలజీతో 6043mm వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. మరియు గేమింగ్ కోసం ప్రత్యేకంగా ఇ-స్పోర్ట్ మోడ్‌ను కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications







