iQOO ప్రత్యేక సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు.. మరో రెండు రోజులు మాత్రమే..!
ఐకూ స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఐకూ క్వస్ట్ డేస్ సేల్ (iQOO Quest Days Sale) ప్రారంభం అయింది. ఈ సేల్‌లో భాగంగా వివిధ ఐకూ ఫోన్‌లను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ డిసెంబర్ 19 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా రూ.10999 ధర నుంచి స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చని ఐకూ చెబుతోంది.
* ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ :
ఐకూ ప్రత్యేక సేల్ లో భాగంగా ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌పై (iQOO 15 Smartphone) రూ.4 వేల డిస్కౌంట్ ను పొందవచ్చు. ఫలితంగా రూ.68999 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ 2K M14 OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 ప్రాసెసర్ తో పనిచేస్తోంది.

* ఐకూ నియో 10 స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మా్ర్ట్‌ఫోన్ ను రూ.34999 (iQOO Neo 10 Smartphone) ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ను గరిష్ఠంగా 6 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్‌ను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్ పైన పనిచేస్తోంది.
* ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ :
ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ (iQOO Neo 10R Smartphone) ధర రూ.24999 గా ఉంది. గరిష్టంగా 6 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ పైన పనిచేస్తుంది.
ఐకూ Z10x స్మార్ట్‌ఫోన్ ను (iQOO Z10x 5G Smartphone) రూ.13,749 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ ను (iQOO Z10R Smartphone) రూ.18999 కే సొంతం చేసుకోవచ్చు. గరిష్ఠంగా 6 నెలల వరకు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే, సోనీ IMX882 OIS కెమెరాను కలిగి ఉంది.
* ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ :
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ (iQOO Z10 Smartphone) ఏకంగా 7300mAh బ్యాటరీతో పనిచేస్తోంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను బ్యాంకు కార్డులతో రూ.20999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు గరిష్ఠంగా 6 నెలల వరకు EMI ఆప్షన్ లు ఉన్నాయి.
* ఐకూ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ :
ఐకూ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ పై (iQOO Z10 Lite 5G Smartphone) రూ.1000 బ్యాంకు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఫలితంగా రూ.10999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఐకూ TWS 1e ఇయర్‌బడ్స్ ను రూ.1899 కే కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








