Home
Deal of the day

మిలిటరీ గ్రేడ్‌, SGS సర్టిఫికేషన్‌లు, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా ఫోన్‌పై రూ.1000 డిస్కౌంట్!

ఐకూ నుంచి భారత్‌ మార్కెట్‌ లో ఇటీవలే ఐకూ 15 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. అయితే ఈ సంవత్సరం అనేక మోడల్స్‌ను లాంచ్‌ చేసింది. బడ్జెట్ ధరలో ఐకూ Z10 లైట్‌ 5G ఫోన్‌ (iQOO Z10 Lite 5G Smartphone) అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రస్తుతం రూ.12 వేల ధర రేంజ్‌ లో అందుబాటులో ఉంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది.

రూ.1000 డిస్కౌంట్‌ :
ప్రస్తుతం అమెజాన్‌ లో ఐకూ Z10 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11,999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.14,999 గా ఉంది. SBI, ICICI బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

iQOO Z10 Lite 5G Smartphone pricedrop

మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ :
అదే యాక్సెస్ బ్యాంకు కార్డులపై రూ.500 డిస్కౌంట్‌ ను అందిస్తోంది. దీంతోపాటు EMI ఆప్షన్‌ లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ సైబర్‌ గ్రీన్‌, టైటానియం బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లో ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ ను కలిగి ఉంది.

యాంటీ ఫాల్‌ సర్టిఫికేషన్‌ :
దీంతోపాటు SGS 5 స్టార్‌ యాంటీ ఫాల్‌ సర్టిఫికేషన్‌ కూడా ఉంది. ఫలితంగా పొరపాటున ఫోన్‌ కిందపడినా డ్యామేజీ కాకుండా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్ పీక్‌ బ్రైట్‌ ను కలిగి ఉంది. Eye ప్రొటెక్షన్‌ ఫీచర్‌ ను కలిగి ఉంది.

iQOO Z10 Lite 5G Smartphone pricedrop

మీడియాటెక్‌ చిప్‌, 3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని ఐకూ హామీ ఇచ్చింది.

50MP కెమెరా, AI ఫీచర్లు :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP సోనీ AI ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలున్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 5MP కెమెరా ఉంది. ఈ ఫోన్‌ AI Erase, AI Document Mode, AI Photo Enhance వంటి ఫీచర్లు ఉన్నాయి.

6000mAh భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్‌, Wi-Fi, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే డార్క్ మోడ్‌ను కూడా కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Z10 Lite 5G Smartphone with 6000mAh battery gets Rs1000 bank discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X