రూ.9998 ధరకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా స్మార్ట్‌ఫోన్!
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day Sale) ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ప్రస్తుతం ప్రైమ్ మెంబర్లు ఈ సేల్ లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. సేల్ డిస్కౌంట్‌లతోపాటు SBI బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు. సేల్ ఎన్ని రోజులపాటు నిర్వహించనున్నారనే సమాచారం వెల్లడి కాలేదు. అయితే ఈ సేల్ లో ఐకూ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ రూ.10 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, యాంటీ ఫాల్ ప్రొటెక్షన్ ను కూడా కలిగి ఉంది.
అమెజాన్‌లో తగ్గింపు ధరలు :
గతంలో ఈ ఫోన్ (iQOO Z10 Lite 5G Smartphone) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11,999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.14,999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్ సేల్ లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ధర రూ.9998 :
ప్రస్తుతం ఈ ఫోన్ 4GB/64GB ధర రూ.9998, 4GB/128GB రూ.10998, 6GB/128GB ధర రూ.11998, 8GB/256GB ధర రూ.13998 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు. సైబర్ గ్రీన్, టైటానియం బ్లూ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఐకూ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. దీంతోపాటు SGS 5 స్టార్ యాంటీ ఫాల్ సర్టిఫికేషన్ కూడా కలిగి ఉంది. కిందపడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశం ఉంటుంది. IP64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది.

6000mAh బ్యాటరీ :
ఐకూ హ్యాండ్‌సెట్ 90Hz రీఫ్రెష్ రేట్ తో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్ ను కలిగి ఉంది. Eye ప్రొటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఐకూ Z10 లైట్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
50MP కెమెరా :
ఈ ఫోన్ 50MP సోనీ AI ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. AI Erase, AI Document Mode, AI Photo Enhance ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








