7300mAh భారీ బ్యాటరీ, 6.77 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్..!
iQOO Z10 Smartphone: ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ గత నెలలో భారత్ మార్కెట్‌లోకి విడుదల అయింది. ఏకంగా 7300mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ బ్యాటరీ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. దీంతోపాటు డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది. అయితే భారీ బ్యాటరీతో లాంచ్ అయినా... స్లిమ్ డిజైన్‌నే కలిగి ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్‌లో ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ను రూ.2000 డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23999 గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.25999 గా ఉంది.

డిస్కౌంట్ అనంతరం ధరలు :
అమెజాన్‌లో SBI క్రెడిట్ కార్డు, ICICI బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్ ధరలు రూ.19,999, రూ.21,999, రూ.23,999 గా ఉండనుంది. ఈ ఫోన్ గ్లేసియల్ సిల్వర్, స్టెల్లర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఫలితంగా ఎక్కువ రోజులపాటు మన్నిక వస్తుంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ ఐకూ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీ తో జతచేసి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది.
భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 90W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ ఈ ఫోన్‌కు ప్లస్ పాయింట్‌గా నిలుస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి, సుమారు రెండు రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. హెవీ యూజర్లకు కూడా ఆకట్టుకొనేలా బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.
కెమెరా విభాగం పరంగానూ ఈ ఫోన్ మెరుగైన కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 2MP కెమెరాను కూడా అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 2 సంవత్సరాల OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది. సర్కిల్ టూ సెర్చ్, AI Erase, AI నోట్ అసిస్ట్, AI సూపర్ డాక్యుమెంట్ ఫీచర్‌లున్నాయి. 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, వైఫై, GPS, USB-C కనెక్టివిటీ ఫీచర్‌లున్నాయి. IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








