Home
Deal of the day

7300mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్‌.. పూర్తి వివరాలు..!

iQOO Z10 Smartphone : ఐకూ సంస్థ భారత్‌ మార్కెట్‌లో ఈ సంవత్సరం తొలిభాగంలో ఏకంగా 7300mAh భారీ బ్యాటరీతో ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. అయితే భారీ బ్యాటరీతో విడుదల అయినా సన్నని డిజైన్‌నే కలిగి ఉంది. మార్కెట్‌లోకి ఇప్పటికే భారీ బ్యాటరీతో అనేక ఫోన్‌లు విడుదల అయ్యాయి. అయితే బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న భారీ బ్యాటరీ బెస్ట్‌ ఫోన్‌లలో ఒకటిగా ఉంది. ఈ ఐకూ ఫోన్‌తో భారీ బ్యాటరీ, సన్నని డిజైన్‌తోపాటు అనేక ప్రత్యేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు ఉన్నాయి.

రూ.2000 డిస్కౌంట్‌ :
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.22,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది. అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను అందిస్తోంది.

iQOO Z10 Smartphone

ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌తో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.20999 ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ స్టెల్లర్‌ బ్లాక్‌, గ్లేసియల్‌ సిల్వర్‌ కలర్‌ వేరియంట్స్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 7.89mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది.

ఫుల్‌ HD+ డిస్‌ప్లే :
ఐకూ Z10 ఫోన్‌ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. దీంతోపాటు MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 12GB LPDDR4x ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 సంవత్సరాల OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.

కెమెరా విభాగం పరంగా ఈ భారీ బ్యాటరీ వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంది.

7300mAh బ్యాటరీ :
ఈ కెమెరా విభాగం AI Note Assist, AI Erase, AI Super Document వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కలిగి ఉన్నాయి. దీంతోపాటు సర్కిల్‌ టు సెర్చ్‌ ఫీచర్లున్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ ఏకంగా 7300mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఈ భారత్‌ మార్కెట్‌లో తొలి భారీ బ్యాటరీ ఫోన్‌గా నిలిచింది. ఈ ఫోన్‌ 90W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుని కలిగి ఉంది.

ఈ ఫోన్‌ కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, Wi-Fi, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Z10 Smartphone with 7300mAh battery gets Rs2000 discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X