భలే ఆఫర్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP కెమెరా, అమోలెడ్ డిస్‌ప్లే ఫోన్‌పై రూ.2500 డిస్కౌంట్!
iQOO Z10R 5G Smartphone : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్ లపై డిస్కౌంట్ ను అందిస్తోంది. గత సంవత్సరం విడుదల అయిన ఐకూ Z10R 5G స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం భారీ డిస్కౌంట్ (Amazon Great Republic Day Sale 2026) ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, యాంటీ ఫాల్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ IP68 + IP69 రేటింగ్, 50MP కెమెరాను కలిగి ఉంది.
రూ.2500 డిస్కౌంట్ :
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20,998, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24998 గా ఉంది. ఈ వేరియంట్స్ ను రూ.2500 కూపన్ కోడ్ డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. అంటే ఎటువంటి బ్యాంకు కార్డుల అవసరం లేకుండానే ఈ డిస్కౌంట్ ను పొందవచ్చు.

దీంతోపాటు SBI క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. అయితే ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ హ్యాండ్‌సెట్ మూన్ స్టోన్, ఆక్వా మెరీన్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఐకూ Z10R స్మార్ట్‌ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, SGS యాంటీ ఫాల్ ప్రొటెక్షన్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. దీంతోపాటు కూలింగ్ ఛాంబర్ ను కూడా కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.

క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, Schott xensation గ్లాస్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. 44W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5700mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఆండ్రాయిడ్ 15 OS :
ఈ ఫోన్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతోంది. స్టీరియో స్పీకర్ లు కూడా ఉన్నాయి.
కెమెరా విభాగం పరంగా (OIS) ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 2MP సెకండరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలు 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్ ను సపోర్టు చేస్తాయి. 5G, 4G LTE, WiFi 6, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది


Click it and Unblock the Notifications








