Home
Deal of the day

రూ.11499 కే 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌.. 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు..!

ఐకూ నుంచి గత సంవత్సరం బడ్జెట్‌ సెగ్మెంట్‌లో ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్‌ (iQOO Z9X 5G Smartphone) విడుదల అయింది. ఆకట్టుకొనేలా స్లిమ్‌ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి వచ్చినా అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.72 అంగుళాల డిస్‌ప్లేతోపాటు 6000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

ధర, ఆఫర్ల వివరాలు :
ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. విడుదల సమయంలో 4GB ర్యామ్ వేరియంట్ ధర రూ.12999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.11,999 దీంతోపాటు కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్‌తో రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

iQOO Z9X 5G Smartphone gets price discount

అదనపు డిస్కౌంట్‌ ఆఫర్‌లు :
ఫలితంగా 4GB ర్యామ్ వేరియంట్‌ను రూ.11499 కే సొంతం చేసుకోవచ్చు. అదే 6GB ర్యామ్‌ వేరియంట్‌ను రూ.12999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్లతోపాటు ICICI, HDFC బ్యాంకు కార్డులపై అదనంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. టోర్నడో గ్రీన్‌, స్ట్ర్రోమ్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌ అందుబాటులో ఉంది.

ఐకూ Z9X 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ఐకూ 5G హ్యాండ్‌సెట్ 6.72 అంగుళాల (2408*1080 పిక్సల్స్) డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. సన్‌లైట్‌లోనూ ఈ ఫోన్‌ను సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు.

3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు :
ఐకూ Z9x 5G హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది. మరియు 4nm స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 1 మొబైల్ ప్లాట్‌ఫాం పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.

50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 2MP సెకండరీ లెన్స్‌ను అమర్చి ఉంది. సెల్ఫీ, వీడియోల కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 44W ఫ్లాష్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

IP64 రేటింగ్‌ :
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌, వైఫైతోపాటు మెరుగైన ఆడియో కోసం డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. మరియు IP64 రేటింగ్‌తో మెరుగైన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ ఫోన్‌గా నిలిచింది. భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

ఐకూ నుంచి ఇటీవల ఐకూ 13 5G స్మార్ట్‌ఫోన్‌ 6.82 అంగుళాల 2K LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కామ్‌ 3nm స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.54,999, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.59,999 గా ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP + 50MP + 50MP కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Z9X 5G Smartphone gets price discount on amazon check features and specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X