అమెజాన్ దీపావళి సేల్ 2024... రెండు డిస్‌ప్లేలు, యాక్షన్ కీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్ 5G ఫోన్‌పై డిస్కౌంట్..!
దీపావళి సందర్భంగా అమెజాన్ ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీవాళీ సేల్ 2024 (Amazon Great indian Festival Diwali Special Sale 2024) పేరుతో సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లు, ల్యా్ప్‌టాప్, స్మా్ర్ట్ వాచ్, ఇయర్‌బడ్స్ సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ అమెజాన్ దీపావళి సేల్ 2024 లో భాగంగా ఇటీవల లాంచ్ అయిన లావా అగ్ని 3 5G హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ (Lava Agni 3 5G) ప్రస్తుతం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8GB ర్యా్‌మ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్లో లభిస్తుంది. 128GB వేరియంట్ ధర రూ.22,999, 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

లావా అగ్ని 3 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
లావా అగ్ని 3 స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు కెమెరా మాడ్యూల్ వద్ద మరో చిన్న డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వెనుకవైపు 1.74 అంగుళాల అమోలెడ్ సెకండరీ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ :
ఈ లావా స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ 3 సంవత్సరాలపాటు అండ్రాయిడ్ అప్‌డేట్‌లను పొందుతుందని సంస్థ వెల్లడించింది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్ సపోర్టుతో 50MP ప్రధాన కెమెరా కెమెరా మరియు 8MP అల్ట్రావైడ్, 3X జూమింగ్ సామర్థ్యంతో 8MP టెలిఫోటో కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
లావా అగ్ని 3 5G స్మార్ట్‌ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను ఛార్జర్ లేకుండా కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు ఛార్జర్ కలిగిన ఫోన్ ధర రూ.22999 గా ఉంటే.. ఛార్జర్ అవసరం లేకుండా ఆ హ్యాండ్‌సెట్‌ను రూ.20999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
యాక్షన్ కీ :
అయితే ఈ లావా హ్యాండ్‌సెట్ అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. వెనుకవైపు డిస్‌ప్లే, ఐఫోన్ తరహాలో యాక్షన్ కీ ని కలిగి ఉంది. దీనిని పవర్ బటన్ వద్ద గుర్తించవచ్చు. దీంతోపాటు వెనుకవైపు ఉన్న చిన్న స్క్రీన్ ను అనేక విధాలుగా వినియోగించుకోవచ్చు. నోటిఫికేషన్‌ల కోసం సహా స్టాప్ వాచ్ గానూ వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








