Home
Deal of the day

రూ.13 వేల ధరలో ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరా 5G స్మార్ట్‌ఫోన్‌!

లావా సంస్థ నుంచి భారత్ మార్కెట్‌ లోకి ఇటీవల లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం బడ్జెట్‌ ధరలో లావా నుంచి అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. లావా బ్లేజ్‌ అమోలెడ్‌ 2 5G స్మార్ట్‌ఫోన్ ను (Lava Blaze Amoled 2 5G Smartphone) ప్రస్తుతం రూ.13 వేల ధర రేంజ్‌ లో అందుబాటులో ఉంది. అయితే ఈ ధరలో ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లే సహా మరిన్ని ఆకట్టుకొనే స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది.

రూ.13400 ధరకే :
లావా బ్లేజ్‌ అమోలెడ్ 2 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.13400 గా (స్పార్కింగ్‌ బ్లాక్) గా ఉంది. అయితే ఫెథర్‌ వైట్‌ కలర్‌ వేరియంట్‌ రూ.14499 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ ను అందిస్తోంది.

Lava Blaze Amoled 2 5G

లావా బ్లేజ్‌ అమోలెడ్ 2 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, HDR సపోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

మీడియాటెక్‌ చిప్‌, 2 సంవత్సరాల అప్‌డేట్స్ :
లావా స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7060 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 6GB LPDDR5 ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్‌ తోపాటు రెండు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు :
ఈ ఫోన్‌ మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం కూలింగ్‌ ఛాంబర్‌ ను కలిగి ఉంది. ఫోన్‌ ఎక్కువ సమయం వినియోగించినా లేదా మల్టీ టాస్కింగ్ సమయంలో వేడెక్కకుండా కూలింగ్‌ ఛాంబర్‌ పనిచేస్తుంది. ఈ లావా ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

50MP సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా లావా బ్లేజ్‌ అమోలెడ్‌ 2 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు 50MP సోనీ IMX752 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్‌ లైట్‌ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందు వైపు 8MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌ డ్యూయల్‌ వ్యూ, పోర్ట్రెయిట్‌, బ్యూటీ, HDR వంటి ఫీచర్లు ఉన్నాయి.

కనెక్టివిటీ పరంగా లావా స్మార్ట్‌ఫోన్‌ 5G, 4G, Wi-Fi, బ్లూటూత్‌ 5.2, USB-C, GPS ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌ లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Blaze Amoled 2 5G smartphone now available at Rs13400 on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X