Home
Deal of the day

ఈ ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్‌.. 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 3 ఏళ్ల అప్‌డేట్స్..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావా నుంచి ఈ నవంబర్‌ 20 వ తేదీన లావా అగ్ని 4 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే ఇటీవల విడుదల అయిన లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ ను ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు ఆండ్రాయిడ్‌ 15 OS, ఫ్లాట్‌ డిస్‌ప్లే, 64MP కెమెరా, 5000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, డిస్కౌంట్ ఆఫర్‌ పూర్తి వివరాలు.

భారత్‌ మార్కెట్‌లో లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ (Lava Play Ultra 5G Smartphone) విడుదల సమయంలో 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.14,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16,499 గా ఉండేది. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

lava play ultra 5G phone price on amazon

రూ.3000 డిస్కౌంట్‌! :
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.12999 ఉంది. మరో స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది. అంటే రూ.2 వేల డిస్కౌంట్‌ ధరతో ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీంతోపాటు రూ.1000 కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. ఫలితంగా రూ.11999 కే లేటెస్ట్‌ 5G హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకోవచ్చు. అంటే మొత్తంగా రూ.3 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు.

లావా స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్‌ HD+ ఫ్లాట్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఆర్కిటిక్‌ ప్రాస్ట్‌, ఆర్కిటిక్‌ స్కేట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది.

lava play ultra 5G phone price on amazon

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని లావా హామీ ఇచ్చింది.

64MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 5MP మ్యాక్రో కెమెరాను అమర్చి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్‌ కోసం 13MP కెమెరాతో అందుబాటులో ఉంది.

5000mAh బ్యాటరీ :
ఈ కెమెరాలు HDR, Night Mode, Pro Mode, Slow Motion, పొర్ట్రెయిట్‌, బ్యూటీ, టైమ్‌ ల్యాప్స్‌ వంటి ఫీచర్లను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

IP64 రేటింగ్ :
ఈ హ్యాండ్‌సెట్‌ మెరుగైన ఆడియో సపోర్టు కోసం స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. IP64 రేటింగ్‌ తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.3, Wi-Fi 6, OTG, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
lava play ultra 5G phone with 64MP Camera now available at Rs11999 price on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X