Home
Deal of the day

రూ.8499 ధరకు 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్!

భారత్‌ మార్కెట్‌లో లావా సంస్థ ఈ ఫిబ్రవరి నెలలో లావా బోల్డ్‌ N2, లావా యువ స్టార్‌ 3 స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఎంట్రీ లెవల్‌ ధరలో అందుబాటులోకి వచ్చిన ఈ రెండు మోడల్స్‌ సేల్స్‌ త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే గత సంవత్సరం లాంచ్ అయిన లావా స్ట్రోమ్‌ లైట్ 5G మోడల్‌ను (Lava Storm lite 5G Smartphone) ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.

లావా స్ట్రోమ్ లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4GB ర్యామ్‌ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.10,499 గా ఉంది. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌పై రూ.1500 కూపన్ కోడ్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

Lava Storm lite 5G smartphone

ఈ డిస్కౌంట్‌ తో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.8,499, రూ.9,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ లావా స్మార్ట్‌ఫోన్‌ కాస్మిక్ టైటానియం, అస్ట్రాల్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

లావా స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
లావా స్ట్రోమ్ లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ గ్లోసీ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 15W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 4GB LPDDR4x ర్యామ్‌, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS అప్‌డేట్‌, 2 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 5MP కెమెరాను అమర్చి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది.

లావా బోల్డ్‌ N2 స్మార్ట్‌ఫోన్ :
లావా నుంచి ఇటీవలే బోల్డ్‌ N2 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.7499 గా ఉంది. ఫిబ్రవరి 27 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇంటి వద్దనే ఉచితంగా సర్వీస్‌ చేస్తామని సంస్థ చెబుతోంది.

లావా బోల్డ్‌ N2 స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. Unisoc SC9863A ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 15 గో వెర్షన్ పైన పనిచేస్తుంది. 13MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Storm lite 5G smartphone with 50MP camera, 5000mAh battery now gets Rs1500 discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X