రూ.12 వేల ధరకే 256GB స్టోరేజీ, 50MP సోనీ కెమెరా, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్!
భారత్ మార్కెట్ లో ఎంట్రీ, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ ఈ సెగ్మెంట్స్ లో అనేక మోడల్స్ ను తీసుకొస్తున్నాయి. లావా ఈ సంవత్సరం జూన్‌లో లావా స్ట్రోమ్ సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా లావా స్ట్రోమ్ ప్లే 5G, లావా స్ట్రోమ్ లైట్ 5G స్మార్ట్‌ఫోన్ లు అందుబాటులోకి వచ్చాయి. స్ట్రోమ్ ప్లే స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.
ప్రస్తుతం లావా స్ట్రోమ్ ప్లే 5G స్మార్ట్‌ఫోన్ (Lava Storm Play 5G Smartphone) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది. ఎటువంటి బ్యాంకు కార్డుల అవసరం లేకుండా కేవలం కూపన్ కోడ్ డిస్కౌంట్ ద్వారా రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ప్రీమియం గ్లోసీ బ్యాక్ డిజైన్ :
అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ డూన్ టైటానియం, ఫ్రాస్టీ బ్లూ కలర్ వేరియంట్స్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రీమియం గ్లోసీ బ్యాక్ డిజైన్ ను కలిగి ఉంది.
డిస్‌ప్లే, ప్రాసెసర్ వివరాలు :
లావా స్ట్రోమ్ ప్లే 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ LPDDR5x ర్యామ్, UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంటుంది.

రెండు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ :
లావా అందించిన వివరాల ఆధారంగా ఈ ఫోన్ గరిష్ఠంగా 8GB వరకు అదనంగా ర్యామ్ ను పొడిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ ఒక సంవత్సరం ఆండ్రాయిడ్ OS అప్‌డేట్, 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP సోనీ IMX752 ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలున్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు.
ఈ స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఫేస్ లాక్ ఫీచర్‌తోపాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 5G, 4G, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications