రూ.7 వేల ధరలో 7000mAh భారీ బ్యాటరీ, 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే ఫోన్..!
Moto G06 Power Smartphone : భారత్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో అనేక స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. అయితే బడ్జెట్ ధరలోనూ భారీ బ్యాటరీలతో కొన్ని ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే మోటోరోలా సంస్థ రూ.7 వేల ధరలో ఏకంగా 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు వేగాన్ లెదర్ బ్యాక్ ప్యానల్ వంటి అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది.
రూ.7499 ధర :
మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.7499 గా ఉంది. ప్రస్తుతం మోటోరోలా వెబ్‌సైట్‌తోపాటు, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవల్ ధరలో భారీ బ్యాటరీ ఫోన్ కోసం చూసే వారికి ఈ హ్యాండ్‌సెట్ మంచి ఆప్షన్‌గా ఉండే అవకాశం ఉంది.

భారీ డిస్‌ప్లే :
మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 720 x 1640 పిక్సల్స్ రిజల్యూషన్, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను పొందుతోంది.
వేగాన్ లెదర్ బ్యాక్ ప్యానల్ :
ఈ హ్యాండ్‌సెట్ వేగాన్ లెదర్ బ్యాక్ ప్యానల్‌ను కలిగి ఉంది. మరియు ప్లాస్టిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ మోటోరోలా ఫోన్ పాంటోన్ టెండ్రిల్, పాంటోన్ లారెల్ ఓక్, పాంటోన్ టేప్‌స్ట్రీ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

50MP కెమెరా, 7000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, మరో సెకండరీ కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది.
తక్కువ ధరలో భారీ బ్యాటరీ ఫోన్‌ల కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 65 గంటలపాటు ప్లేబ్యాక్ టైంను పొందవచ్చని మోటోరోలో సంస్థ చెబుతోంది.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ SoC చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ ఫోన్ గూగుల్ జెమిని AI అసిస్టెంట్ కూడా ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 6.0, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో సపోర్టు కోసం డాల్పీ అట్మాస్ సపోర్టురో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఉంది. దీంతోపాటు యాంబియంట్ లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications