Home
Deal of the day

రూ.13999 ధరకే 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ఫుల్‌ HD+ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్!

Moto G57 Power 5G Smartphone : మోటోరోలా నుంచి ఇటీవల సిగ్నేచర్‌ స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. సేల్‌ కూడా ప్రారంభం అయింది. అయితే గత సంవత్సరం లాంచ్ అయిన మోటో G57 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 7000mAh భారీ బ్యాటరీ సహా ఆండ్రాయిడ్ 16 OS పైన పనిచేస్తోంది. దీంతోపాటు ఫుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

రూ.13999 ధరకే :
భారత్‌ మార్కెట్‌లో విడుదల సమయంలో మోటో G57 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ ధర రూ.13999 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను పొందవచ్చు.

moto G57 power 5G

ఫుల్‌ HD+ డిస్‌ప్లే :
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1050 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 120Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతోంది.

మిలిటరీ గ్రేడ్‌ ప్రొటెక్షన్‌ :
ఈ డిస్‌ప్లే స్మార్ట్‌ వాటర్‌ టచ్‌ 2.0 ఫీచర్‌ను కలిగి ఉంది. అంటే తడి చేతులతోనూ వినియోగించుకోవచ్చు. IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. MIL 810H మిలిటరీ గ్రేడ్‌ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ పాంటోన్‌ ప్యూడిటీ, పాంటోన్‌ కోర్సెయిర్‌, పాంటోన్‌ రెగట్టా కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
మెటోరోలా స్మార్ట్‌ఫోన్ స్నా్ప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 4 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ర్యామ్‌ బూస్ట్‌ ఫీచర్‌ కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 17 OS, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP కెమెరా :
ఈ ఫోన్‌ 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 2 ఇన్‌ 1 లైట్‌ సెన్సర్‌ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలతో 60fps వద్ద 2K వీడియోలను రికార్డు చేయవచ్చు. Magic Eraser, Photo Unblur, Cinematic Photos, Auto Frame, పొర్ట్రెయిట్‌ బ్లర్‌, పొర్ట్రెయిట్‌ లైట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

7000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్‌ 5.1, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సర్, యాంబియంట్‌ లైట్‌ సెన్సర్, గైరోస్కోప్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
moto G57 power 5G smartphone with 7000mAh battery now available at Rs13999 price on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X