ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. రూ.2 వేల డిస్కౌంట్‌తో 50MP కెమెరా, 6720mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్..!
Moto G86 Power 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా భారత్ మార్కెట్‌లో ఆగస్టు నెలలో మోటోరోలా G96 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. మీడియాటెక్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 OS, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP సోనీ కెమెరాను కలిగి ఉంది. అయితే కేవలం ఒక నెలలోనే ఈ ఫోన్ ధర రూ.2 వేలు తగ్గింది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి వివరాలు.
రూ.2 వేల డిస్కౌంట్ :
మోటో G86 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉండేది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై మరింత తగ్గింపును పొందవచ్చు.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఈ హ్యాండ్‌సెట్ మోటోరోలాలో బడ్జెట్ ధరలో ఉన్న మోడల్స్‌లో బెస్ట్ ఫోన్‌గా ఉంది. ఈ ధరలో మంచి డీల్‌గానే భావించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డెన్ సైప్రెస్, కాస్మిక్ స్కై, స్పెల్ బౌండ్ కలర్ వేరియంట్స్ అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.
మోటోరోలా G86 పవర్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల సూపర్ HD అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+, Low Blue Light, Low Motion Blur SGS సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.
6720mAh భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 4nm ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4x ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 33W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్టుతో 6720mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 3 ఇన్ 1 ఫ్లిక్కర్ సెన్సార్ అమర్చి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ధరకు మంచి కెమెరాలుగా భావించవచ్చు.
ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. డాల్బీ అట్మాస్, Hi-Res ఆడియో సర్టిఫికేషన్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. 5G, 4G, బ్లూటూత్ 5.4, Wi-Fi 6, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చారు.


Click it and Unblock the Notifications








