రూ.3 వేల డిస్కౌంట్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, కర్వడ్ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరాలతో 5G స్మార్ట్‌ఫోన్.
మోటోరోలా సంస్థ ఈ సంవత్సరం భారత్ మార్కెట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ముఖ్యంగా మోటో ఎడ్జ్ 60 సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో అందుబాటులోకి వచ్చిన మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, మెరుగైన డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. దీంతోపాటు డిజైన్ పరంగానూ ఆకట్టుకుంటుంది. సేల్ ఆఫర్లతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
భారత్‌లో విడుదల సమయంలో ఈ ఫోన్ (Motorola Edge 60 Fusion Smartphone) 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.22,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి 2025 సేల్‌లో భాగంగా రూ.3 వేల డిస్కౌంట్‌తో రూ.19,999, రూ.21,999 ధరలకు అందుబాటులోకి వచ్చింది.

అదనంగా 10 శాతం తగ్గింపు :
దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపును పొందవచ్చు. అంటే సుమారుగా మరో రూ.2 వేలు అంతకంటే ఎక్కువ అదనపు తగ్గింపును పొందవచ్చు. పాంటోన్ స్లిప్‌స్ట్రీమ్, పాంటోన్ అమెజోనైట్, పాంటోన్ జెఫిర్, పాంటోన్ మైకనోస్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 1.5K ఆల్ కర్వడ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. HDR10+, వాటర్ టచ్ 3.0 ను సపోర్టు చేస్తుంది.
ఈ డిస్‌ప్లే పాంటోన్ ట్రూ కలర్, Low Motion బ్లర్ సర్టిఫికేషన్, SGS Low Blue లైట్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. IP68 + IP69 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 Soc చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుందని మోటోరోలా హామీ ఇచ్చింది.
కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT-700C ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 13MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 3 ఇన్ 1 లైట్ సెన్సర్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.
ఈ ఫోన్ 68W వైర్ టర్బో ఛార్జింగ్ తో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ మోటో స్మార్ట్ కనెక్ట్ 2.0, ప్యామిలీ స్పేస్ 3.0, మోటో సెక్యూర్ 3.0, మోటో గెశ్చర్స్ వంటి ఫీచర్లను సపోర్టు చేస్తుంది. సర్కిల్ టూ సెర్చ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన ఆడియో ఎఫెక్ట్ కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, NFC సహా USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








