Home
Deal of the day

రూ.14999 ధరకు 7000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ 5G ఫోన్‌!

Motorola G57 Power Smartphone : మోటోరోలా గత సంవత్సరం డిసెంబర్‌ లో మోటో G57 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ ను తీసుకొచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం బడ్జెట్‌ ధరలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 50MP సోనీ కెమెరా, స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 16 OS, 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సేల్‌ వివరాలు.

రూ.14999 ధరకు :
మోటోరోలా G57 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ ఫోన్ పాంటోన్‌ ఫ్లూడిటీ, పాంటోన్ కొర్సెయిర్, పాంటోన్‌ రెగట్టా కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

Motorola G57 Power

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్‌ 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1050 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 120Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ ను కలిగి ఉంది. స్మార్ట్‌వాటర్‌ టచ్‌ 2.0 ఫీచర్‌ ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ ఫోన్‌ ను ఆపరేట్‌ చేసుకోవచ్చు.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్ స్నా్ప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 4 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 4GB LPDDR4X ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 17 OS అప్‌డేట్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని మోటోరోలా హామీ ఇచ్చింది.

50MP కెమెరా :
మోటోరోలా G57 పవర్‌ ఫోన్‌ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2 ఇన్ 1 లైట్‌ సెన్సర్‌ లు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది.

7000mAh బ్యాటరీ :
ఈ ఫోన్‌ Auto Frame, Photo Unblur, Cinematic Photos, Magic Eraser, పొర్ట్రెయిట్ బ్లర్‌, పొర్ట్రెయిట్‌ లైట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ను సపోర్టు చేస్తుంది.

మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.1, Wi-Fi, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ప్రాక్సిమిటీ సెన్సర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌, గైరోస్కోప్‌, ఇ-కంపాస్‌ వంటి సెన్సార్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్ ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola G57 Power 5G Smartphone with 7000mAh battery now available at Rs14999 price on Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X