Home
Deal of the day

రూ.15999 ధరకు 50MP సోనీ కెమెరా, 5000mAh బ్యాటరీ, కర్వడ్‌ డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్‌!

మోటోరోలా భారత్‌ మార్కెట్‌లో ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇటీవల ఎడ్జ్‌ సిరీస్‌తోపాటు G సిరీస్‌ మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే G సిరీస్‌ నుంచి G86 పవర్‌, G06 పవర్, G67 పవర్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. G67 పవర్‌ మోడల్‌ ఇవాళ్టి నుంచే సేల్‌ ప్రారంభం అయింది. అయితే గత సంవత్సరం లాంచ్‌ అయిన మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ చిప్‌, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

భారత్‌ మార్కెట్‌లో విడుదల సమయంలో మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్ (Motorola G85 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ రూ.19999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15999, రూ.17999 ధరలకు అందుబాటులో ఉన్నాయి.

Motorola G85 5G smartphone

దీంతోపాటు బ్యాంకు కార్డులపై మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ ఓలివ్‌ గ్రీన్, అర్బన్‌ గ్రే, వివో మజెంటా, కోబాల్ట్‌ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్‌ 6.67 అంగుళాల FHD+ 3D కర్వడ్‌ pOLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, , 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌, 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ను కలిగి ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 3 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. దీంతోపాటు Adreno 619 GPU ను కూడా అమర్చి ఉంది. ఆండ్రాయిడ్ 14 Hello UI పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని హామీ ఇచ్చింది.

50MP సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంది. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.1, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టు కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP52 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ ఫోన్‌ మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను అమర్చారు. దీంతోపాటు ప్రాక్సిమిటీ సెన్సర్‌, యాక్సెలిరోమీటర్‌, గైరోస్కోప్‌, యాంబియంట్‌ లైట్‌, ఇ-కంపాస్‌ ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Motorola G85 5G smartphone now available at Rs15999 price on flipkart, full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X