అమెజాన్ సేల్.. ధర రూ.11,499 కే 128GB స్టోరేజీ, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్..!
భారత్ మార్కెట్ లో నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ (Nokia G42 5G Smartphone) గత సంవత్సరం విడుదల అయింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ అమెజాన్ లో డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆకట్టుకొనే డిజైన్, మెరుగైన స్పెసిఫికేషన్ లు, ఫీచర్‌లను కలిగి ఉంది. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.
అమెజాన్‌లో (Amazon) నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డు, IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, HDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. అమెజాన్‌లో నోకియా G42 5G ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.

నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు :
నోకియా G42 5G హ్యాండ్‌సెట్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 720*1612 పిక్సల్ రిజల్యూషన్, 560 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ నోకియా ఫోన్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంది.
నోకియా స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5G SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 6GB ఫిజికల్ ర్యామ్‌తోపాటు 5GB వర్చువల్ ర్యామ్ ను కలిగి ఉంటుంది. మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజీతో అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.

నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మూడు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు, 2 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను పొందుతుందని సంస్థ వెల్లడించింది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP AI ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 2MP మ్యాక్రో కెమెరాలను అమర్చి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌గా ఉంది. మరియు గ్రే, పర్పుల్ వంటి రెండు రంగుల్లో లభిస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ బ్యాక్ ప్యానల్‌ను రీసైక్లింగ్ ప్లాస్టిక్ తో తయారీ చేశారు.


Click it and Unblock the Notifications