50MP + 50MP + 50MP కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ నథింగ్ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ఆఫర్..!
Nothing Phone 3a Pro Smartphone : నథింగ్ సంస్థ భారత్ మార్కెట్‌లో ఈ సంవత్సరం అనేక మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఇటీవలే ఈ నథింగ్ నుంచి ఫోన్ 3a లైట్ వేరియంట్ విడుదల అయింది. రూ.20 వేల ధర సెగ్మెంట్లో ఈ హ్యాండ్‌సెట్‌ను తీసుకొచ్చింది. అయితే నథింగ్ ఫోన్ 3a సిరీస్ భారత్‌లో ఈ సంవత్సరం మార్చిలో విడుదల అయింది. ఇందులో ఫోన్ 3a, ఫోన్ 3a ప్రో మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రో మోడల్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ :
నథింగ్ ఫోన్ 3a ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.29999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.31999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ల ధరలు రూ.28999, రూ.30999, రూ.32999 గా ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. విడుదల ధరతో పోలిస్తే రూ.3 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, గ్రే కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది.
డిస్‌ప్లే వివరాలు :
నథింగ్ ఫోన్ 3a ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz అడాప్టి్వ్ రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Panda గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ చిప్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత NothingOS 3.1 పైన పనిచేస్తుంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.
మూడు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP శాంసంగ్ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 6x ఇన్ సెన్సర్, 60x డిజిటల్ జూమ్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (OIS, EIS) ఉంది. 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.
ఫాస్ట్ ఛార్జింగ్ :
ఈ హ్యాండ్‌సెట్ 50W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 100 శాతం ఛార్జింగ్‌ను కేవలం 56 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని నథింగ్ చెబుతోంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ గ్లిఫ్ కంపోజర్, గ్లిఫ్ టైమర్, గ్లిఫ్ టార్చ్, గ్లిఫ్ ప్రొగ్రస్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








