అమెజాన్ దీపావళి సేల్.. 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6.78 అంగుళాల డిస్‌ఫ్లే Oneplus ఫోన్‌పై డిస్కౌంట్!
దీపావళీ సందర్భంగా ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీవాళీ స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, ల్యాప్‌టాప్, ఎయిర్‌పాడ్స్‌లు సహా ఇతర ఎలక్ర్టానిక్స్ గ్యాడ్జెట్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ అమెజాన్ దీపావళీ ప్రత్యేక సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్‌ను (Oneplus 12R Smartphone) తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా 10 శాతం తగ్గింపును పొందవచ్చు. మరియు ఎక్స్చేంజీ ఆఫర్‌ల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.
వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో (Amazon Great Indian Festival Diwali Special Sale 2024) 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా 10 శాతం తగ్గింపును పొందవచ్చు. అన్ని వేరియంట్‌లపైనా ఈ తగ్గింపు ధరను పొందవచ్చు. అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.

వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల (1264*2780 పిక్సల్స్) 1.5K LTPO ProXDR డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. మరియు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో అందుబాటులో ఉంది.
ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Oxygen OS 14 తో (Out Of The Box) పనిచేస్తోంది. దీంతోపాటు 4nm స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్ 16GB LPDDR5X ర్యామ్, Adreno 740 GPU తో జతచేయబడింది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.

50MP ప్రైమరీ కెమెరా :
ఈ హ్యాండ్‌సెట్ కెమెరా విభాగం పరంగా వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX890 కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. ముందువైపు ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.
100W సూపర్‌వూక్ ఛార్జింగ్ :
వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్ 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఎక్కువ రోజులపాటు బ్యాటరీ మన్నిక వచ్చేలా ప్రత్యేక టెక్నాలజీని కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.
కనెక్టివిటీ ఫీచర్‌లు :
కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.3, వైఫై 6E, NFC, USB-C వంటి కనెక్టింగ్ ఫీచర్లున్నాయి. దీంతోపాటు గైరోస్కోప్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్. యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్ లను కలిగి ఉంది. కూల్ బ్లూ, ఐరన్ గ్రే, సన్‌సెట్ డూన్ రంగుల్లో ఈ వన్‌ప్లస్ 12R 5G స్మార్ట్‌ఫోన్ లభించనుంది.


Click it and Unblock the Notifications








