Home
Deal of the day

వన్‌ప్లస్‌ ఫోన్‌పై రూ.4000 డిస్కౌంట్‌.. 6000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలు సహా..!

OnePlus 13R Smartphone : వన్‌ప్లస్‌ నుంచి ఈ నెల 13వ తేదీన వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ చైనా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అయితే ఈ సంవత్సరం జనవరిలో విడుదల అయిన వన్‌ప్లస్‌ 13 తోపాటు వన్‌ప్లస్‌ 13R మోడల్స్‌ విడుదల అయ్యాయి. ప్రస్తుతం వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ ను డిస్కౌంట్‌ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

విడుదల సమయంలో వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.42,999, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.49,999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో బేస్‌ వేరియంట్‌ రూ.4 వేల డిస్కౌంట్‌ ధరకు అందుబాటులోకి వచ్చింది.

Oneplus 13R Smartphone gets Rs4000 pricedrop

రూ.38999 ధరకే వన్‌ప్లస్‌ ఫోన్‌ :
ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.38,999 గా ఉంది. దీంతోపాటు బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ ఆస్ట్రల్‌ ట్రైల్‌, నెబ్యూలా నెయిర్‌ కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ వన్‌ప్లస్‌ 13R స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల FHD+ LTPO (1264 x 2780 పిక్సల్స్‌) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతోంది.

Oneplus 13R Smartphone gets Rs4000 pricedrop

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 16GB ర్యామ్, 512GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

50MP + 50MP కెమెరా :
ఈ హ్యాండ్‌సెట్‌ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 2x ఆప్టికల్ జూమింగ్‌ సామర్థ్యంతో 50MP టెలిఫోటో లెన్స్‌ ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరాను అమర్చారు.

6000mAh బ్యాటరీ :
సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రైమరీ కెమెరా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ వన్‌ప్లస్‌ హ్యాండ్‌సెట్‌ IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది. 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్‌ 5.4, NFC వంటి ఫీచర్‌లు ఉన్నాయి. యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌, యాక్సెలిరోమీటర్‌, ప్రాక్సిమిటీ, కలర్‌ టెంపరేచర్‌ సెన్సర్‌, కంపాస్‌, గైరోస్కోప్‌, హాల్‌ సెన్సర్‌, IR రిమోట్‌ కంట్రోల్‌ సెన్సర్‌ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Oneplus 13R Smartphone with snapdragon 8 Gen 3 chip gets Rs4000 discount on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X