Home
Deal of the day

50MP కెమెరా, 28 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌ అయ్యే వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌పై గరిష్ఠంగా రూ.3000 తగ్గింపు!

వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్లో జులై నెలలో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. 1.5K రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లే, 100W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ వన్‌ప్లస్‌ మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్‌లో డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్‌లతో మరింత తగ్గింపును పొందవచ్చు.

భారత్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్లో లభిస్తుంది. మెర్య్కురియల్‌ సిల్వర్‌, ఒయాసిస్ గ్రీన్‌, అబ్సిడియన్ మిడ్‌నైట్‌ రంగుల్లో లభిస్తుంది.

Oneplus nord 4 5G Smartphone

విడుదల సమయంలో 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.27,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర విడుదల సమయంలో రూ.32,999 గా ఉండగా.. ప్రస్తుతం రూ.29,999 కే సొంతం చేసుకోవచ్చు.

అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ విడుదల సమయంలో రూ.35,999 ఉండగా.. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.32,999 కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్ చేయండి.

Oneplus nord 4 5G Smartphone

వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ (Oneplus Nord 4 Smartphone) 6.74 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1240*2772 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 450 ppi పిక్సల్‌ డెన్సిటీను కలిగి ఉంది.

ఈ వన్‌ప్లస్‌ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్‌ 3 SoC తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ Adrenoi 732 GPU, 8GB LPDDR5X ర్యామ్ మరియు 256GB UFS 4.0 తో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14.1 ను కలిగి ఉంది. నాలుగు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లు, రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చు.

కెమెరా విభాగం పరంగా ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను అమర్చారు. OIS, EIS ఫీచర్‌ల సపోర్టుతో 50MP సోనీ LYT కెమెరా, మరియు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాతో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 100W Supervooc ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ బ్యాటరీ హెల్త్ ఇంజిన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఫలితంగా బ్యాటరీ ఎక్కువ రోజులపాటు మెరుగైన పనితీరు కలిగి ఉండేలా చూస్తుంది. కేవలం 28 నిమిషాల్లో 1-100 శాతం ఛార్జింగ్ అవుతుందని వన్‌ప్లస్‌ తెలిపింది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై 6, GPS, NFC, Glonass, BDS, Galileo, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆర్టిఫిషియల్‌ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus nord 4 5G Smartphone received price cut on amazon november 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X