ధర రూ.16,999 కే 50MP కెమెరా, 80W ఛార్జింగ్ సపోర్టు, 6.7 అంగుళాల డిస్‌ప్లే OnePlus స్మార్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి త్వరలో వన్‌ప్లస్ 13 విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ చైనాలో ఇటీవలే లాంచ్ అయింది. భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు ఇప్పటికే అనేక వన్‌ప్లస్ హ్యాండ్‌సెట్‌లు డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ వన్‌ప్లస్ హ్యాండ్‌సెట్ రూ.26999 ధరకు విడుదల కాగా.. ప్రస్తుతం అమెజాన్‌లో సుమారు రూ.10,000 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G స్మార్ట్‌ఫోన్ (OnePlus nord CE 3 5G Smartphone Pricedrop) గత సంవత్సరం జులైలో భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ (ఆక్వా సర్జ్ కలర్ వేరియంట్) విడుదల ధర రూ.26999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.16,999 కే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.

వన్‌ప్లస్ నార్డ్ CE 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 అంగుళాల FHD+ ప్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2412*1080 పిక్సల్స్ రిజల్యూషన్, 950 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160 PWM డిస్మింగ్‌తో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ ను సపోర్టు చేస్తుంది.
ఈ వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 782G చిప్‌సెట్ తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 13.1 ఆధారిత OxygenOS 13 ఆధారంగా పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ గరిష్ఠంగా 256GB స్టోరేజీని కలిగి ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
ఈ ఫోన్ స్మార్ట్‌ఫోన్ 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టు చేస్తుంది. మరియు 8MP సోనీ IMX355 ఆల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G స్మార్ట్‌ఫోన్ 80W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-FI, బ్లూటూత్ 5.2, GPS, A-GPS, NFC సహా USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ కంపాస్, IR, గైరోస్కోప్, యాక్సెలిరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 168 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్వా సర్జ్, గ్రే శిమ్మర్ రంగుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే డిస్కౌంట్ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో వెల్లడి కాలేదు.


Click it and Unblock the Notifications








