Home
Deal of the day

29 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌ అయ్యే వన్‌ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింపు.. అమెజాన్‌లో సేల్..!

భారత్‌లో ఇయర్‌ ఎండ్‌ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌ల ధరలు తగ్గుతున్నాయి. ఇ-కామర్స్‌ సంస్థలు పలు ఆఫర్లను అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు ధరను పొందవచ్చు. ఈ ఫోన్ 5,500mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరాను కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 5G స్మార్ట్‌ఫోన్ (OnePlus Nord CE 4 5G Smartphone) ప్రస్తుతం 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.22,990 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదే 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.24,999 కే సొంతం చేసుకోవచ్చు.

oneplus nord ce 4 5g smartphone received price cut

ఈ సేల్‌లో భాగంగా (Smartphone Discounts on Amazon) ICICI బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే అమెజాన్‌ పే ఐసీఐసీఐ కార్డులపై ఈ ఆఫర్‌ లేదు. దీంతోపాటు HDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 6 లేదా అంతకంటే ఎక్కువ నెలల EMI లావాదేవీలపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

వన్‌కార్డ్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అమెజాన్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్‌ చేయండి. ఈ ఫోన్‌ డార్క్‌ క్రోమ్‌, సెలడాన్‌ మార్బుల్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2160Hz PWM డి‌మ్మింగ్‌ను కలిగి ఉంది. మరియు ఆక్వా టచ్‌ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. తడి చేతులతోనూ ఈ స్క్రీన్‌ను నియంత్రించే అవకాశం ఉంది.

ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4X ర్యామ్‌, 256GB UFS 3.1 స్టోరేజీ, Adreno 720 GPU తో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OxygenOS 14 తో పనిచేస్తుంది.

ఈ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌తో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలను అమర్చి ఉంది. ఈ కెమెరాలతో 4K నాణ్యతతో వీడియోలను క్యాప్చర్‌ చేయవచ్చు. మరియు ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీని ద్వారా 30fps వద్ద 1080p నాణ్యతతో వీడియోలను క్యాప్చర్‌ చేయవచ్చు.

ఈ వన్‌ప్లస్‌ హ్యాండ్‌సెట్ 100W Supervooc ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 29 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చని వన్‌ప్లస్‌ తెలిపింది. IP54 రేటింగ్‌తో కూడిన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌, డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను అమర్చి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
oneplus nord ce 4 5g smartphone received price cut on amazon december 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X