12.1 అంగుళాల డిస్‌ప్లే, 9150mAh బ్యాటరీ OnePlus Pad 2 పై రూ.5000 వరకు తగ్గింపు..!!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి ఈ సంవత్సరం జులై నెలలో వన్‌ప్లస్ ప్యాడ్ 2 (Oneplus pad 2 Tablet) విడుదల అయింది. ప్రీమియం లుక్‌లో భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్యాడ్ 12.1 అంగుళాల 3K LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS తో పనిచేస్తుంది. 9,510mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. భారత్ మార్కెట్‌లో ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 2 రెండు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ ధర తగ్గింది. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరో రూ.3000 తగ్గింపును పొందవచ్చు.
వన్‌ప్లస్ ప్యాడ్ 2 ప్రస్తుతం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.39,999, 12GB ర్యామ్ ధర రూ.42,999 గా ఉండేది. ప్రస్తుతం ఈ రెండు వేరియంట్‌ల ధరలు రూ.2000 చొప్పున తగ్గాయి.

ఫలితంగా వీటి ధరలు వరుసగా రూ.37,999, రూ.40,999 గా ఉన్నాయి. దీంతోపాటు ICICI, RBL, కొటక్ బ్యాంకు కార్డుల ద్వారా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే సుమారు రూ.5000 తగ్గింపును పొందవచ్చు. దీంతో వన్‌ప్లస్ ప్యాడ్ 2.. 8GB ర్యామ్ + 128GB ర్యామ్ వేరియంట్‌ను రూ.34,999 కే సొంతం చేసుకోవచ్చు.
వన్‌ప్లస్ ప్యాడ్ 2 ట్యాబ్లెట్ (Oneplus pad 2) 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.37,999 కు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అమెజాన్‌లో ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 2 ట్యాబ్లెట్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
వన్‌ప్లస్ ప్యాడ్ 2 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
వన్‌ప్లస్ ప్యాడ్ 2.. 144Hz రీఫ్రెష్ రేట్‌తో 12.1 అంగుళాల 3K IPS LCD (3000*2120 పిక్సల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ప్యాడ్ డిస్‌ప్లే 900 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 303PPI రిజల్యూషన్, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ ప్యాడ్ 2 క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు ఈ ప్యాడ్ గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం Adreno 750 GPU చిప్‌సెట్‌తో జతచేసి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14.1 ను కలిగి ఉంది. గరిష్టంగా 256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంది.
వన్‌ప్లస్ ట్యాబ్లెట్ కెమెరా విభాగం పరంగా వెనుకవైపు 13MP కెమెరాను అమర్చి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. కెమెరాలతో 30fps వద్ద 1080p నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ ప్యాడ్ 2.. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 9150mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
వన్‌ప్లస్ ప్యాడ్ 2 అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. AI Eraser 2.0, AI టూల్‌బాక్స్, స్మార్ట్ కటౌట్ 2.0, రికార్డింగ్ సమ్మరీ, స్కాన్ డాక్యుమెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు వన్‌ప్లస్ టచ్ ట్రాన్సిమిషన్, యాప్ రిలే, రిమోట్ ఫైల్ యాక్సెస్, సెల్యూలర్ డేటా షేరింగ్, ఓపెన్ కాన్వాస్, యాప్ ఆటో అడాప్షన్ వంటి ఫీచర్‌లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








