లేటెస్ట్ ఫోన్‌పై రూ.5 వేల డిస్కౌంట్.. 7000mAh భారీ బ్యాటరీ, 6.8 అంగుళాల భారీ బ్యాటరీ సహా సూపర్ ఫీచర్లు!
ఒప్పో సంస్థ భారత్ మార్కెట్‌లో ఆగస్టు నెలలో ఒప్పో K13 టర్బో సిరీస్ ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో K13 టర్బో, ఒప్పో K13 టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఒప్పో K13 టర్బో హ్యాండ్‌సెట్‌ను సుమారు నెల వ్యవధిలోనే భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 7000mAh భారీ బ్యాటరీ, 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే, వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, డిస్కౌంట్ ఆఫర్ల వివరాలు.
రూ.5 వేల డిస్కౌంట్ :
ఈ సంవత్సరం ఆగస్టు నెలలో విడుదలైన సమయంలో ఈ ఒప్పో K13 టర్బో స్మార్ట్‌ఫోన్ (Oppo K13 Turbo 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.27,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.29,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.5 వేల డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

మూడు కలర్ వేరియంట్స్ :
అంటే ప్రస్తుతం రూ.22999, రూ.24999 ధరలకే సొంతం చేసుకోవచ్చు. ఎటువంటి బ్యాంకు కార్డుల అవసరం లేకుండానే ఈ డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ ఫోన్ మిడ్‌నైట్ మావ్‌రిక్, పర్పుల్ ఫాంటమ్, వైట్ నైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఒప్పో K13 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ IPX6, IPX8, IPX9 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ :
ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15.0.2 పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని ఒప్పో తెలిపింది.

50MP కెమెరా, 7000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలున్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలున్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ బైపాస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఇన్‌బిల్ట్ ఫ్యాన్, ఎయిర్ డక్ట్స్, 7000 Sq mm వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను అమర్చారు. ఫలితంగా గేమింగ్ సహా వీడియో స్ట్రీమింగ్ సమయాల్లో ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








