Home
Deal of the day

6.9 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌!

పోకో సంస్థ భారత్ మార్కెట్‌ లో ఈ సంవత్సరం జనవరి నెలలో పోకో M8 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 3D కర్వడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 3 చిప్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. 50MP కెమెరా, 5520mAh బ్యాటరీతో పనిచేస్తోంది. అయితే గత డిసెంబర్ నెలలో విడుదల అయిన పోకో C85 5G స్మార్ట్‌ఫోన్‌ ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ వంటి ఆకట్టుకొనే స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

భారత్‌ మార్కెట్‌ లో పోకో C85 5G స్మార్ట్‌ఫోన్‌ (Poco C85 5G Smartphone Price cut) విడుదల సమయంలో 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.11999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14499 గా ఉండేది.

Poco C85 5G pricedrop

రూ.1000 డిస్కౌంట్‌ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) మూడు వేరియంట్స్‌ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లను వరుసగా రూ.10999, రూ.11999, రూ.13499 ధరకు కొనుగోలు చేయవచ్చు. అంటే కేవలం రెండు నెలల్లోనే రూ.1000 డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్‌ ను కూడా పొందవచ్చు.

భారీ డిస్‌ప్లే :
పోకో C85 5G స్మార్ట్‌ఫోన్‌ 6.9 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 810 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు TUV Low Blue లైట్‌, TUV సర్కాడియన్‌, TUV ఫ్లిక్కర్‌ ఫ్రీ సర్టిఫికేషన్లను కలిగి ఉంది.

Poco C85 5G pricedrop

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా 50MP AI ప్రైమరీ కెమెరా, మరో లెన్స్‌ ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్ లైట్‌ ఉంది. వీటితోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై, 3.5mm ఆడియో జాక్‌, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ డ్యూయల్‌ టోన్‌ ఫినిష్‌ ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ ఫోన్ మిస్టిక్‌ పర్పుల్‌, పవర్‌ బ్లాక్‌, స్ప్రింగ్‌ గ్రీన్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco C85 5G smartphone with 6000mAh battery gets rs1000 pricedrop on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X